ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఈ రోజు 9% జంప్, ఏడాదిలో 200 శాతం వృద్ధి

టెక్-ఎనేబుల్డ్ వీసా ప్రాసెసింగ్ కంపెనీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ షేర్లు నేడు 9 శాతానికి పైగా పెరిగాయి. ఈ వార్త రాసే సమయానికి ఈ స్టాక్ 9.12 శాతం లేదా రూ.16.15 పెరిగి రూ.193.25 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా ఎగిసిపడగా, ఇదే సమయంలో నేడు సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి లేదా స్వల్పంగా లాభపడ్డాయి. బుధవారం బిజినెస్ కరస్పాండెంట్ జీరో మాస్(ZMPL) అక్వైజేషన్‌ను ప్రకటించిన తర్వాత ఈ స్మాల్ క్యాప్ స్టాక్ జంప్ చేసింది. తద్వారా భారత అతిపెద్ద వ్యాపార కరస్పాండెంట్ నెట్ వర్క్‌గా అవతరించింది.

ఈ వీసా ప్రాసెసింగ్ కంపెనీ జెడ్ఎంపీఎల్‌ను రూ.120 కోట్లతో కొనుగోలుకు అంగీకరించింది. ఇందులో ప్రధాన ప్రమోటర్ అనురాగ్ గుప్తా 63.94 శాతం ఈక్విటీ వాటా కలిగి ఉన్నారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే పూర్తయిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌కు ఇప్పుడు జెడ్ఎంపీఎల్‌లో 88.26 శాతం వాటా ఉంది. ఇక ఎస్బీఐకి ఇందులో 6.83 శాతం వాటా ఉంది.

 Small Cap Stock Zooms 9 percent, Soars Upto 200 percent in 1 Year

ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఐదు రోజుల కాలంలో 2.44 శాతం, నెల రోజుల్లో 16 శాతం, ఆరు నెలల కాలంలో 98.96 శాతం, ఏడాది కాలంలో 200 శాతం లాభపడింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో ఈ స్టాక్ 103.79 శాతం పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.207.50 కాగా, 52 వారాల కనిష్టం రూ.61.08.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+