Multibagger: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లతో పోలిస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇటీవల భారీ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయి. కొన్ని షేర్లలో వృద్ధి నమ్మశక్యంగా లేని స్థాయిలో ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే కేవలం స్మాల్ క్యాప్ స్టాప్ ఎంచుకొని అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారూ ఉన్నారు. పెట్టుబడిదారుల్లో ఈ తరహా ఆలోచనా ధోరణి క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఓ స్టాక్ విషయంలో మార్కెట్లో భారీ బజ్ నెలకొంది.
దిల్లీకి చెందిన ప్రసిద్ధ స్మాల్ క్యాప్ స్టార్ట్ పిక్కర్ ఆశిష్ చగ్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ.. మతిపోయే రిటర్న్స్ నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా 441 శాతం రాబడి అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కంపెనీ మరేదో కాదు ఇంటెలివేట్ క్యాపిటల్ వెంచర్స్. తాజా సమాచారం ప్రకారం.. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా సంస్థ అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

ఇక కంపెనీ విషయానికొస్తే.. బౌటోనియర్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో 95 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు మే 2022 వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రముఖ కాఫీ చైన్ భరిస్టాలో బౌటోనియర్ 88.35 శాతం వాటా కలిగి ఉంది. ఇదే కాక కైలిన్ ఎక్స్‌పీరియన్స్, కైలిన్ ఎక్స్‌ప్రెస్, కైలిన్ స్కైబార్ మరియు వాంచైలను హోల్డ్ చేస్తున్న కైజెన్ రెస్టారెంట్లలో 100 శాతం వాటా దీని సొంతం.
ఇంటెలివేట్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేయడంపై ఆశిష్ చగ్ స్పందించారు. '350 పైగా అవుట్‌లెట్లతో దేశంలోని రెండో అతిపెద్ద కాఫీ చైన్ భరిస్టాలో వాటా కలిగి ఉన్న సంస్థలో వాటా దక్కించుకోవడం మంచి ఆలోచన. కైజెన్ అనుభవం కూడా కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ ఫుడ్ చైన్స్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అవకాశం ఉంది' అన్నారు.
ఇంటిలివేట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఒక స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడం లాంటిదేనని చగ్ తెలిపారు. స్టార్టప్ వ్యవస్థాపకుల మాదిరిగానే కంపెనీ ప్రమోటర్స్ కూడా తమకు సరిపడే వ్యాపార నమూనా, వృద్ధికి ఆస్కారం ఉన్న ఎంపికలు చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారన్నారు. ఈ ఏడాది జనవరి 2న 11.63గా ఉన్న షేర్ వాల్యూ.. సెప్టెంబర్ ఒకటి నాటికి 62.96కి పెరిగింది. జూన్ త్రైమాసికంలో సగటు షేర్ విలువ 16.27తో పోలిస్తే.. ఇప్పటివరకు 287 శాతం వృద్ధి సాధించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications