Penny Stock: డివిడెండ్ అందిస్తున్న పెన్నీ స్టాక్.. రేటు తక్కువ లాభం ఎక్కువ.. డబుల్ ధమాకా
Dividend Stock: స్టాక్ మార్కెట్లలో పెద్ద కంపెనీల షేర్లకు ఏమాంత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నాయి స్మాల్ క్యాప్ స్టాక్స్. ప్రధానంగా ఇటీవలి ర్యాలీని గమనిస్తే స్మాల్, మిడ్ క్యాప్ కేటగిరీలోని కంపెనీల షేర్లు అత్యధికంగా పురోగతిని సాధించాయి.
ఈ క్రమంలోనే స్మాల్ క్యాప్ కేటగిరీలోని టెక్స్‌టైల్ కంపెనీ అందరినీ ఆకర్షిస్తోంది. పెన్నీ స్టాక్ గా ఉన్న అక్షర్ స్పింటెక్స్ మార్కెట్ క్యాప్ శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి రూ.140 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో షేర్ ధర 3.30 శాతం పెరిగి రూ.5.63 వద్ద ప్రయాణాన్ని ముగించింది. అయితే కంపెనీ మార్కెట్ ర్యాలీలో పాల్గొనటంతో పాటుగా తన పెట్టుబడిదారులకు డివిడెండ్ ప్రకటన చేసింది.

డివిడెండ్ చెల్లింపు కోసం కంపెనీ జనవరి 4, 2024ను రికార్డు తేదీగా ప్రకటించింది. "2023-2024 ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఈక్విటీ షేరుకు 1% మధ్యంతర డివిడెండ్ రూ.1 చొప్పున ప్రకటించాలని బోర్డు చర్చించి, నిర్ణయించింది. కంపెనీల చట్టం 2013 నిబంధనల ప్రకారం సభ్యుల/ప్రయోజనకరమైన యజమానుల రిజిస్టర్‌లో పేర్లు ఉన్న షేర్‌హోల్డర్‌లకు డిక్లరేషన్ తేదీ నుంచి 30 రోజులలోపు మధ్యంతర డివిడెండ్ చెల్లించబడుతుందని అక్షర్ స్పింటెక్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ చెల్లిస్తున్న డివిడెండ్ పొందాలనుకుంటే అందుకోసం ముందుగా వారు అక్షర్ స్పింటెక్స్ షేర్ హోల్డర్ అయి ఉండాలి. అంటే చట్టప్రకారం ఎవరైతే కంపెనీ ప్రకటించిన రికార్డు తేదీ అంటే జనవరి 4 నాటికి వారు తమ డీమ్యాట్ ఖాతాల్లో షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. మెుత్తానికి పెన్నీ స్టాక్స్ సైతం అటు మార్కెట్ గెయిన్ తో పాటుగా ఇటు డివిడెండ్ ఆదాయాన్ని అందించటంతో ఇన్వెస్టర్లు డబుల్ ధమాకా లాభాలు పొందుతున్నారు.


Click it and Unblock the Notifications