Best Small Cap Mutual Funds: వార్షికంగా 20 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చిన బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం కంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో కూడా మంచి రాబడి వచ్చే ఫండ్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల రాబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా సిప్ రూపంలో పెట్టుబడి పెడితే మంచిదని సూచిస్తున్నారు. కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు సిప్ పెట్టుబడిదారులు భారీగా లాభాలను ఇచ్చాయి.
వాల్యూ రీసెర్చ్ వారి డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో ఐదు స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 20 శాతం కంటే ఎక్కువ వార్షిక సిప్ రాబడులను అందించాయి. అత్యధిక రాబడి ఇచ్చిన ఫండ్లలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అగ్రస్థానంలో ఉంది. ఇది దశాబ్ద కాలంలో 25.92% వార్షిక సిప్ రాబడిని ఇచ్చింది. దీని తర్వాత నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత పదేళ్లలో 22.60 శాతం రిటర్న్స్ ఇచ్చింది, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.97 శాతం, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.81 శాతం, డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ 20.27 శాతం రాబడి ఇచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో వచ్చిన భారీ ర్యాలీని, అలాగే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కొత్త ఫండ్స్ వచ్చాయి.

బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఐదేళ్లలో 23.90 శాతం వార్షిక సిప్ రాబడి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో ITI స్మాల్ క్యాప్ ఫండ్ 23.80%, ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ 22.87%, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 22.13 శాతం రాబడి ఇచ్చాయి. ఈ నాలుగు ఫండ్‌లు మూడేళ్ల SIP రాబడి ర్యాంకింగ్‌లలో కూడా అగ్రస్థానంలో ఉన్నాయి.దీర్ఘకాలిక పనితీరు చరిత్ర కలిగిన ఫండ్‌లలో యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ ఐదేళ్లుగా బలమైన పనితీరు కనబరిచిన వాటిలో కొనసాగుతున్నాయి. గత మూడు, ఐదు, పది సంవత్సరాల SIP రాబడి ర్యాంకింగ్‌లలో అగ్ర ఐదింటిలో స్థానం సంపాదించిన ఏకైక పథకం యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ మూడేళ్లలో 18.40% వార్షిక సిప్ రాబడితో నాల్గవ స్థానంలో, ఐదేళ్లలో 19.81%తో ఐదవ స్థానంలో, 10 ఏళ్లలో 20.81%తో నాల్గవ స్థానంలో నిలిచింది.
అయితే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఐటీఐ (ITI) స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వంటివి మూడు, ఐదు సంవత్సరాల ర్యాంకింగ్‌లలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, వీటికి ఇంకా 10 ఏళ్ల పనితీరు చరిత్ర లేదు. గత దశాబ్ద కాలంలో అత్యధిక సంపదను సృష్టించిన కొన్ని పథకాలు స్వల్పకాలిక ర్యాంకింగ్‌లలో వెనుకబడ్డాయి. అయితే గతంలో వచ్చినట్లుగానే ఇప్పుడు రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏమి ఉండదు. ఫండ్ మేనజర్ ను బట్టి రాబడి మారుతూ ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications