Small Cap Mutual Funds: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలంలో పెట్టుబడులు పెడితేనే సాధ్యమని వివరిస్తున్నారు. రిస్క్ తీసుకునేవారికి స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి ఎంపికగా పేర్కొంటున్నారు. సగటు రోలింగ్ రాబడులు, గత మూడేళ్లలో స్థిరత్వం, నష్టభయం, మెరుగైన పనితీరు, ఆస్తుల పరిమాణం ఆధారంగా ఎంపిక చేసిన స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఏమిటో చూద్దాం. యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ను 2013 నవంబర్ లో ప్రారంభమైంది. ఈ స్మాల్‌క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా 25 శాతం రాబడిని అందించింది.
యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఆరు నెలలుగా మూడవ క్వార్టైల్‌లో కొనసాగుతోంది. అంతకు ముందు ఈ పథకం రెండవ క్వార్టైల్‌లో ఉండేది. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ను 2009 డిసెంబర్ లో ప్రారంభించారు. ఈ స్మాల్‌క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా 24% రాబడిని అందించింది. ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడు నెలలుగా మూడవ క్వార్టైల్‌లో ఉంది. అంతకు ముందు ఈ పథకం నాల్గవ క్వార్టైల్‌లో ఉండేది. కోటక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. గత మూడేళ్లలో రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా 26% రాబడిని అందించింది.

కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ గత నెలలో మూడవ క్వార్టైల్‌లో ఉంది. అంతకు ముందు ఈ పథకం నాల్గవ క్వార్టైల్‌లో ఉండేది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ను 2010 డిసెంబర్ లో ప్రారంభించారు. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లుగా రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా 33.5% రాబడిని అందించింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లుగా మూడవ క్వార్టైల్‌లో ఉంది. ఇంతకుముందు ఈ పథకం రెండవ క్వార్టైల్‌లో ఉండేది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
పెట్టుబడి మొత్తం స్మాల్ క్యాప్ లో పెట్టుబడిపడి పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.10 వేల పెట్టుబడి పెట్టాలనుకుంటే అందులో రూ.4 వేలు స్మాల్ క్యాప్, రూ.2 వేలు మిడ్ క్యాప్, రూ.2 వేలు లార్జ్ క్యాప్, మరో రూ.2 వేలు ఫ్లెక్సీ క్యాప్ లేదు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే సరిపోతుంది. మీరు ఈ పెట్టుబడిని 5 నుంచి 8 సంవత్సరాలు కొనసాగిస్తే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications