స్టాక్ మార్కెట్లో దుమ్ము రేపిన తంగమాయిల్ జ్యువెలరీ.. 10 సెషన్లలో 70 శాతం ర్యాలీతో పెట్టుబడిదారులకు లాభాల పంట

తంగమాయిల్ జ్యువెలరీ లిమిటెడ్ షేరు ధర ఇటీవల బలమైన పెరుగుదలతో మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలో 70 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ స్టాక్, ఈ సీజన్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మల్టీబ్యాగర్ జ్యువెలరీ షేర్‌గా నిలిచింది. నవంబర్ 7న ఈ స్టాక్ రూ.3,319.80 వద్ద కొత్త ఆల్‌టైమ్ హైని తాకింది. ఇది వరుసగా ఆరో రోజు లాభాలను నమోదు చేయడం గమనార్హం. జూలై 2023 తర్వాత ఇంత బలమైన వారపు ర్యాలీ ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు.

తంగమాయిల్ జ్యువెలరీ రెండవ త్రైమాసిక ఫలితాలు కంపెనీకి గేమ్‌చేంజర్‌గా నిలిచాయి. కీలక ఆర్థిక గణాంకాలు (Q2 FY26)ను ఓ సారి మనం చూసినట్లయితే.. నికర లాభం రూ. 58.15 కోట్లుగా ఉంది (గత సంవత్సరం రూ.17.45 కోట్ల నష్టంతో పోలిస్తే ఇది పెరుగదలగా చెప్పుకోవచ్చు. మొత్తం అమ్మకాలు రూ. 1,705 కోట్లు ఇది గతంలో రూ. 1,178 కోట్ల నుండి పెరిగింది. ఇక రిటైల్ అమ్మకాలు విషయానికి వేస్తే.. రూ. 1,636 కోట్లుగా ఉన్నాయి (+45%). అలాగే టోకు అమ్మకాలు విషయానికి వస్తే రూ. 69 కోట్లు (+47%) శాతం పెరుగుదల. EBITDA విషయానికి వస్తే రూ. 106 కోట్లు (గత సంవత్సరం రూ. 7 కోట్ల నష్టం నుండి లాభంగా) ఉంది. ఇక EBITDA మార్జిన్ 6.48 శాతంగా ఉంది (+710 bps పెరుగుదల). ఈ ఫలితాలు పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని నింపాయి, జ్యువెలరీ రంగంలో డిమాండ్ ఇంకా బలంగానే ఉందని స్పష్టంచేశాయి.

smallcap jewellery stock jewellery shares rally stock up 50 percent smallcap multibagger best jewellery stocks India stock market news NSE BSE smallcap stocks jewellery company share price stock expert predictions multibagger stocks 2025 jewellery sector stocks Indian stock market trends best smallcap stocks top performing jewellery stock investor alert 50 NSE BSE 2025

ఈ త్రైమాసికంలో కంపెనీ 7 కొత్త స్టోర్లను ప్రారంభించి, మొత్తం 66 అవుట్‌లెట్‌లకు విస్తరించింది. చెన్నైలో మొదటి దశ విస్తరణ పూర్తయ్యింది. రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని స్టోర్లు తెరవనున్నట్లు కంపెనీ తెలిపింది. అర్ధ సంవత్సరం (H1 FY26) గణాంకాలు కూడా బలంగానే ఉన్నాయి.

నికర లాభం: రూ. 104 కోట్లు (+167%)
ఆదాయం: రూ. 3,260 కోట్లు (+36%)
అక్టోబర్ ఆదాయం:రూ. 1,032 కోట్లు (మొదటిసారి నెలవారీ రూ. 1,000 కోట్ల మార్కును దాటి)
వార్షిక వృద్ధి: 178%. ఈ గణాంకాలు కంపెనీ విస్తరణ వ్యూహం సఫలమైందని సూచిస్తున్నాయి.

తంగమాయిల్ జ్యువెలరీ షేర్ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇప్పటికే లాభదాయకంగా నిరూపితమైంది.. 3 సంవత్సరాల్లో +557% రాబడి ఇచ్చింది.5 సంవత్సరాల్లో +1,417% రాబడినిచ్చింది. గత 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు పాజిటివ్ రిటర్న్స్ వచ్చాయి. ఇది జ్యువెలరీ రంగంలో దీర్ఘకాల వృద్ధి కథను ప్రతిబింబిస్తుంది.

మార్కెట్ మొత్తం స్థిరంగా ఉన్నప్పటికీ.. తంగమాయిల్ జ్యువెలరీ తన స్వంత ఊపుతో ముందుకెళ్తోంది. బలమైన Q2 ఫలితాలు, రిటైల్ విస్తరణ, రికార్డు ఆదాయం కారణంగా ఈ షేర్ పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగిస్తోంది.తంగమాయిల్ జ్యువెలరీ ఇప్పటి వరకు చూపించిన పెరుగుదల రేటు ఆధారంగా చూస్తే.. ఇది జ్యువెలరీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+