RedTape Stock: ప్రస్తుతం మార్కెట్లు భారీ ఓలటాలిటీతో నష్టాలను చూస్తుండగా ఇన్వెస్టర్లు మాత్రం తెలివిగా ఈ సమయంలో లాభాలను పెట్టుబడుల రూపంలో అందుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు త్రైమాసిక ఫలితాల తర్వాత ఉచితంగా బోనస్ షేర్లు, డివిడెండ్లు వంచివి అందిస్తుండగా వాటిని వినియోగించూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెడ్‌టేప్ కంపెనీ గురించే. స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో కంపెనీ షేర్లు రూ.915 స్థాయికి ఎగబాకాయి. నేడు కంపెనీ షేర్లు ఒక్కసారిగా రాకెట్ వేగంతో పుంజుకోవటానికి అసలు కారణం బోర్డు ఇన్వెస్టర్లకు డివిడెండ్లతో పాటు బోనస్ షేర్లను అందించటానికి ఆమోదం తెలియచేటమే. ఈ క్రమంలో కంపెనీ బోర్డు అర్హత కలిగిన పెట్టుబడిదారులకు 3:1 నిష్పత్తిలో ఉచిత షేర్లను అందించాలని నిర్ణయించింది. కంపెనీ ఉచితంగా రూ.2 ముఖవిలువ కలిగిన 41,46,05,700 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో అందించనున్నట్లు తన ఫైలింగ్స్ లో వెల్లడించింది.

అయితే బోనస్ షేర్లకు సంబంధించి రికార్డు తేదీని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇదే సమయంలో రెడ్‌టేప్ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.2 మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. ఈ మధ్యంతర డివిడెండ్‌ను పొందటానికి అర్హతను నిర్ణయించేందుకు కంపెనీ జనవరి 3, 2025ను రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే డివిడెండ్ ఆదాయం పొందాలనుకునే ఎవరైనా ఇన్వెస్టర్ల జనవరి 3 నాటికి తమ డీమ్యాట్ ఖాతాల్లో కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తూ ఉండాలి అప్పుడే వారి కంపెనీ బుక్స్ ప్రకారం పెట్టుబడిదారులుగా గుర్తించబడతారు. అందువల్ల ముందుగా డివిడెండ్ చెల్లింపు తర్వాత కంపెనీ తన బోనస్ షేర్లకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠానికి చేరువయ్యేందుకు కష్టపడుతున్నాయి. వాస్తవానికి స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.981.80 నుండి కేవలం 7 శాతం దూరంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.454.75గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.12,400 కోట్లుగా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications