Multibagger Stock: మల్టీబ్యాగర్ కంపెనీల నుంచి లాభాలు పొందాలంటే అందుకు కేవలం ఆశ ఉంటే సరిపోదు వేచి ఉండే ఓపిక కూడా ఉండాలి. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు సంపాదించిన అనేక మంది ప్రముఖులు చెప్పే మాట కూడా ఇదే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఓ స్మాల్ క్యాప్ చిచ్చర పిడుగు కంపెనీ గురించే. ఇది ఆటో అనుబంధ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గడచిన పదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది JBM ఆటో మల్టీబ్యాగర్ స్టాక్. ఈ కాలంలో ఇన్వెస్టర్లు దాదాపు 9900 శాతానికి పైగా రిటర్న్ పొందారు. తాజాగా SML ఇసుజులో నియంత్రణ వాటాను పొందేందుకు JBM ఆటో ప్రముఖ పోటీదారుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో 10 ఏళ్ల కిందట రూ.10,000 పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.10 లక్షలకు చేరుకుని ఉండేది. అంటే దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మంచి రాబడిని పొందారని తెలుస్తోంది. అంటే లక్ష పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రస్తుతం వారు కోటీశ్వరులు అయి ఉండేవారు.
ఎస్ఎస్ఈలో శుక్రవారం మార్కెట్ క్లోజింగ్ నాటికి JBM ఆటో షేరు ధర రూ.984.90గా ఉంది. గడచిన నెలరోజుల్లో స్టాక్ ధర దాదాపు 29 శాతం లాభపడింది. ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల సంపదను 166 శాతం పెంచేసింది. ప్రస్తుతం ఈ స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,620 కోట్లుగా ఉంది. JBM ఆటో అమ్మకాలు FY2023లో రూ.1,364 కోట్ల నుంచి రూ.3,857 కోట్లకు పెరిగాయి. దీంతో కంపెనీ లాభం రూ.57 కోట్ల నుంచి దాదాపు రూ.124 కోట్లకు చేరుకుంది. ఆటోమోటివ్ ఉత్పత్తులను తయారీలో వ్యాపారం కొనసాగిస్తున్న కంపెనీలో ప్రమోటర్లు 67.52% వాటాను కలిగి ఉన్నారు.
రానున్న కాలంలో కంపెనీ షేర్ ధర రూ.1,200 స్థాయికి చేరుకోవచ్చని GCL బ్రోకింగ్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ కౌశిక్ తెలిపారు. అయితే కొనాలనుకునే వారు రూ.870 స్టాప్ లాక్ గా పరిగణించాలని సూచించారు. స్టాక్ స్వల్ప కాలంలో రూ.1,100 మార్కును దాటవచ్చన్నారు. అలాగే అరిహంత్ క్యాపిటల్‌కు చెందిన రత్నేష్ గోయల్ షేరును రూ.880-రూ.850 మధ్య కొనుగోలు చేసేందుకు అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన అంచనాల ప్రకారం స్టాక్ ధర రూ.1,100కు చేరుకోవచ్చని పేర్కొన్నారు.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications