Dividend Stock: స్టాక్ మార్కెట్లలో అధిక డివిడెండ్ అందించే కంపెనీ షేర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువను పెంచుకోవటంతో పాటు డివిడెండ్ రూపంలో మంచి ఆదాయాన్ని పొందాలనుకునే ఇన్వెస్టర్లు చాలా మందే ఉంటారు.
ఈ క్రమంలో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ భారీ మెుత్తంలో డివిడెండ్ ఆఫర్ చేయటం ఇన్వెస్టర్లను ప్రస్తుతం ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హాకిన్స్ కుక్కర్స్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ ప్రస్తుతం ఒక్కో షేరుపై రూ.100 డివిడెండ్ ఆఫర్ చేస్తూ ఇన్వెస్టర్లపై కనకవర్షం కురిపిస్తోంది. దీంతో మార్కెట్లో చాలా మంది దృష్టి కంపెనీ షేర్లపై పడింది.

వంటగదిలో వినియోగించే ప్రెజర్లు కుక్కర్లు, ఇతర ఉపకరణాలను తయారు చేసే వ్యాపారంలో ఈ చిన్న కంపెనీ నిమగ్నమై ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.3,376.75 కోట్లుగా ఉంది. మార్చి త్రైమాసికానికి కంపెనీ రూ.253.85 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ 10 రూపాయలు ముఖ విలువ కలిగిన షేర్లపై దాదాపు 1000 శాతం డివిడెండ్ అందించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. కంపెనీ నిర్ణయించిన డివిడెండ్ అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లో సెప్టెంబర్ 8లోపు జమ కానుంది. ఈ రోజు 11.35 గంటల సమయంలో హాకిన్స్ కుక్కర్స్ స్టాక్ ధర రూ.6,377.05 వద్ద కొనసాగుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.6,572.75 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.4,932.05గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications