Bonus Shares: బోనస్ షేర్లను అందిస్తున్న రెండు స్టాక్స్.. డివిడెండ్ కూడా..
Bonus Shares: పెద్ద కంపెనీలకు ఏ మాత్రం తక్కువ కాదంటూ ఇటీవల స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్లను అందిస్తున్నాయి. అలాగే కొన్ని స్టాక్స్ వీటికి తోడు మల్టీబ్యాగర్ రాబడులను సైతం అందిస్తూ.. అబ్బుర పరుస్తున్నాయి.

త్రైమాసిక ఫలితాలు..
రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన స్మాల్‌క్యాప్ కంపెనీ జిమ్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సైతం అందిస్తోంది. ఏడాది ప్రాతిపదికన క్యూ-2లో 31.08 శాతం అధిక విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ లాభం గత సంవత్సరం ఈ కాలంతో పోల్చితే 182.50 శాతం పెరిగి రూ.5.65 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై 2 షేర్లను బోనస్‌గా ఇవ్వాలని డైరెక్టర్లు నిర్ణయించారు. అయితే దీనకి సంబంధించి రికార్డు తేదీని ప్రకటించలేదు. 6 నెలల కాలంలో కంపెనీ షేరు ధర రూ.198.65 నుంచి రూ.313.50కి పెరిగింది.

డివిడెండ్ స్టాక్..
స్మాల్ క్యాప్ కంపెనీ మోర్గానైట్ క్రూసిబుల్ (ఇండియా) లిమిటెడ్ త్రైమాసిక ఫలితాలతో పాటు డివిడెండ్‌ను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్ అందించాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీని కంపెనీ 23 నవంబర్ 2022గా నిర్ణయించారు. అంటే ఆ సమయానికి షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్ చెల్లిస్తుంది. రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.3.90 కోట్లుగా ఉంది.

చిన్న స్టాక్స్..
కేవలం తక్కువ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నప్పటికీ చిన్న కంపెనీలు మంచి రాబడులతో పాటు ఇన్వెస్టర్లకు సంపదను కూడా సృష్టిస్తున్నాయి. కానీ స్మాల్ అండ్ పెన్నీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిగతావాటి కంటే కొంచెం ఎక్కువ జాగ్రత్త, శ్రద్ధ అవసరం. అందుకే ఇన్వెస్టర్లు సరైన కంపెనీలను ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications