Market Blast: మార్కెట్ ర్యాలీలో పెద్ద పేలుడు.. రూ.1.6 లక్షల కోట్ల నష్టం.. మీరూ పోగొట్టుకున్నారా..
Small & Midcap: దాదాపు 6 నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు పెద్ద ర్యాలీని కొనసాగించాయి. దీనికి తోడు ఇటీవల అనేక ఐపీవోలు ఎస్ఎమ్ఈ కేటగిరీలో రావటంతో మెగా ర్యాలీ నిరంతరం కొనసాగిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే మంచి రోజులు ముగిసిపోయినట్లు కనిపిస్తోంది. వీటిలో ఇన్వెస్టర్ చేసిన అనేక మంది సంపద ప్రస్తుతం ఆవిరైపోతోంది. మార్కెట్ల ఆందోళనల మధ్య పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి లాభాలను చిత్తు చేస్తోంది. వాస్తవానికి మార్కెట్లలోని సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు ప్రస్తుతం రికార్డు గరిష్ఠాలను తాకినప్పటికీ.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.91%, మిడ్‌క్యాప్ 0.65% పతనమయ్యాయి. BSEలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటల్ మునుపటి సెషన్‌లో సుమారు రూ.393 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.391.4 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.1.6 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

మిడ్ & స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. స్మాల్‌క్యాప్ సెగ్మెంట్ తక్కువ పనితీరును కొనసాగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మిడ్‌క్యాప్ విభాగంలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ బుధవారం 20 శాతం పడిపోయింది. మహానగర్ గ్యాస్‌లో 15 శాతానికి పైగా క్షీణత ఉంది. కాప్రీ గ్లోబల్ 14.13 శాతం నష్టపోయింది. జేఎఫ్ ఫైనాన్షియల్ 10.43 శాతం క్షీణతను నమోదు చేసింది. స్మాల్ క్యాప్ సెగ్మెంట్ పరిశీలిస్తే ఇండస్ఇండ్‌బ్యాంక్‌లో 11 శాతం, యునిన్ఫో టెలికామ్‌లో 10 శాతం, మోహిత్ ఇండస్ట్రీస్‌లో 8.79 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఓవర్ వాల్యుయేషన్ కారణంగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇటీవలి కాలంలో సెన్సెక్స్ కంటే ఎక్కువగా పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.
క్షీణతకు కారణాలు..
- స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్‌కు సెబీ హెచ్చరిక జారీ చేసింది.
- భారీ ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కి దిగారు.
- స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోని షేర్ల ధరలు విపరీతంగా పెరుగుతూ ఆందోళనలు పెంచుతున్నాయి.
- ఈ సెగ్మెంట్ కింద ఉండే షేర్లతో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు ఇటీవల అధికంగా హెచ్చరించటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.


Click it and Unblock the Notifications