అందుకే భారత్‌లో మందగమనం, పెట్టుబడులు తగ్గాయి: ఆర్థిక సర్వే
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశ పెట్టారు. CEA సుబ్రహ్మణియన్ ఆర్థిక సర్వే వివరాలను విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఇన్‌ఫోగ్రాఫిక్స్ ప్రదర్శించారు. ఆరు నెలల్లో ప్రవేశపెడుతున్న రెండో ఆర్థిక సర్వే ఇది అని, ఈసారి సర్వే థీమ్ వెల్త్ క్రియేషన్ అన్నారు. ఆగస్ట్ 15న ప్రధాని మోడీ సంపద సృష్టిపై మాట్లాడారని, సంపద సృష్టికర్తలను గౌరవించాలని, వారు సంపదను సృష్టించకుంటే సంపదను పంచలేమన్నారు.
ఎకనమిక్ సర్వే.. మరిన్ని కథనాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో..
ఆర్థిక సర్వే కవర్‌ను రూ.100 నోటుపై నుంచి తీసుకున్న ఊదారంగును ఉపయోగించినట్లు చెప్పారు. పాత కొత్తల ఆలోచనన కలయిక ఈ ఆర్థిక సర్వే అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో భారత ఆర్థిక వ్యవస్థ కూడా మందగించిందన్నారు.

పెట్టుబడులు తగ్గాయి
నాన్ ఫుడ్ క్రెడిట్ విభాగంలోని కార్పోరేట్ రుణాలు 2013లో అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత తగ్గాయన్నారు. పెట్టుబడులు తగ్గాయని, ఇది జీడీపీపై ప్రభావం చూపిందన్నారు.

వీటికి చికిత్స అవసరం
వినిమయం తగ్గి, NBFCలు ఒత్తిడికి గురి కావడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, తక్కువ పన్ను ఆదాయాలు వంటి వాటికి వెంటనే చికిత్స అవసరమన్నారు. సంపద సృష్టికర్తల నుంచి ప్రతి ఒక్కరు లబ్ధి పొందారని రుజువైందన్నారు. ఒక పెద్ద సంస్థ బడ్జెట్ బాగుండకుంటే దాని ప్రభావం మిగతా వాటిపై పడుతుందన్నారు.

అవసరమైన రంగాల్లో కార్మికులు..
చైనాలో కార్మికులు ఎక్కువగా అవసరమైన రంగాల్లో ఉన్నారని, భారత్‌లోను అలాంటి రంగాల అవసరం ఉందన్నారు. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు లేకుంటే మనం సామాజిక కార్యక్రమాలపై రెట్టింపు మొత్తాన్ని వెచ్చించే వారమని చెప్పారు.


Click it and Unblock the Notifications