కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. నిరుద్యోగం పెరిగింది. వృద్ధి రేటు ప్రతికూలత నమోదు చేస్తోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో నిరుద్యోగం క్రమంగా తగ్గుతోంది. ఉద్యోగిత శాతం క్రమంగా పెరుగుతున్నప్పటికీ వేతనవృద్ధి మాత్రం మందగించింది. నిరుద్యోగిత రేటు తగ్గుతున్నా వేతనవృద్ధి తగ్గుదల ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకుగా మారిందని అంటున్నారు. డెలాయిట్ టచ్ తోహమత్సు ఇండియా ఎల్ఎల్పీ సర్వే ప్రకారం సగటు వేతన వృద్ధి 3.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇది 8.6 శాతంగా ఉంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 23 శాతం కంపెనీలు మాత్రమే వచ్చే ఏడాది వేతనాలు పెంచుతామని తెలిపాయి.

కంపెనీ వేతన బిల్లులు
కంపెనీల వేతన బిల్లులు జూన్ నుండి మూడు నెలల కాలంలో 2.9 శాతం మేర పెరిగాయి. 18 ఏళ్లలో ఇది కనిష్టమని ముంబైకి చెందిన ప్రయివేట్ రీసెర్చ్ కంపెనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పీవీటీ (CMIE) చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ కంపెనీ 1,560 లిస్టెడ్ కంపెనీలపై సర్వే నిర్వహించింది. తయారీ రంగాన్ని తీసుకుంటే వేతనాలు 7 శాతం మేర క్షీణించాయని, ఇది భారీగానే ఉందని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ అన్నారు.

ప్రయివేటు ఖర్చుల్లో క్షీణత
CMIE అంచనా ప్రకారం నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 23.5 శాతం ఉండగా, జూలైలో 7.4 శాతానికి తగ్గింది. మనది ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో వేతనవృద్ధి మందగించడం వల్ల ప్రయివేటు ఖర్చులు తగ్గుతాయి. మన దేశంలో జీడీపీలో వినియోగం 60 శాతం వరకు ఉంటుంది. కరోనా కారణంగా భారత జీడీపీ 4.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది.

సిబ్బంది ఖర్చులు 3 శాతమే పెరిగాయి
కరోనా మహమ్మారి నేపథ్యంలో 19.5 శాతం మేర ఆర్థిక సంకోచం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. లేబర్ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే కరోనా ముందుస్థాయికి ఉద్యోగాలు పెరుగుతాయని భావించవచ్చునని, కానీ వేతన దృక్పథం మాత్రం మారుతుందని, వేతన వృద్ధి మసకబారే అవకాశాలు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, దాబుర్ ఇండియా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి కంపెనీల స్టాఫ్ ఖర్చులు గత క్వార్టర్‌లో తగ్గిపోయి, 3 శాతం మేర మాత్రమే పెరిగాయి. అలాగే, కొన్ని కంపెనీల్లో వేతన కోతలు గుర్తు చేస్తున్నారు. వేతన కోతలతో పాటు అధిక వేతనం కంటే తక్కువ వేతన ఉద్యోగులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. భారత వేగవంతమైన వృద్ధికి ఇది కూడా ఆటంకమే అంటున్నారు. ఎందుకంటే ఖర్చులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications