గత కొద్దిరోజుల క్రితం స్టాక్ మార్కెట్ కుదేలైన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇందుకు ట్రంప్ సుంకాలే ప్రధాన కారణంగా నిలిచాయి. మరోవైపు ఇదే సమయంలో ఒక్క ఐపీవోల ప్రస్తావన కూడా లేదు. దింతో ఇన్వెస్టర్లు, బయ్యర్లు కొత్త ఐపీవోల కోసం చూస్తుండగా స్లిప్ అండ్ హోమ్ సొల్యూషన్స్ అందించే స్టార్టప్ కంపెనీ వేక్‌ఫిట్ కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇప్పటికే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే IPO తీసుకొచ్చేనందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. దీని కోసం కంపెనీ యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ అలాగే నోమురాను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా నియమించుకుంది.

వేక్‌ఫిట్ కంపెనీ రూ.1,500 కోట్ల నుండి రూ.2,000 కోట్ల అంటే సుమారు $200 మిలియన్ల వరకు ఫండ్స్ సేకరించాలని చుస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే IPO కోసం డ్రాఫ్ట్ పేపర్లు (DRHP) ఫైల్ చేసే తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ IPOలో కొత్త షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో కొంత భాగం ఉంటుందని కూడా తెలిపాయి. అయితే, ఈ వాటా ఎంత ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వేక్‌ఫిట్ ఇప్పటివరకు పీక్ ఎక్స్‌వి పార్టనర్స్, పారామార్క్ వెంచర్స్ (దక్షిణ కొరియా) అండ్ వెర్లిన్‌వెస్ట్ (యూరప్) నుండి $100 మిలియన్లకు పైగా అంటే సుమారు రూ. 850 కోట్లు నిధులను సేకరించింది.
పరుపుల నుండి హోమ్ ఫర్నిషింగ్ వరకు వేక్‌ఫిట్ ప్రయాణం: 2016లో అంకిత్ గార్గ్ , చైతన్య రామలింగెగౌడ వేక్‌ఫిట్‌ను మెట్రెస్ బ్రాండ్‌గా లాంచ్ చేసారు. కానీ మెల్లిమెల్లిగా కంపెనీ వ్యాపార పరిధిని విస్తరించి మంచాలు, బెడ్స్, టేబుళ్లు, కుర్చీలు ఇంకా ఇతర ఫర్నిషింగ్ ఉత్పత్తుల విభాగంలోకి కూడా ప్రవేశించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.199 కోట్లుగా ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,017 కోట్లకు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ.146 కోట్ల నష్టం రాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.15 కోట్లు తగ్గింది.
IPO మార్కెట్లో పోటీ: ప్రస్తుతం మార్కెట్లో వేక్‌ఫిట్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, వుడెన్‌స్ట్రీట్, ఐకియా వంటి కంపెనీలతో పోటీపడుతుంది. మన దేశంలో ఫర్నిచర్ & స్లీప్ సొల్యూషన్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది, దీని ద్వారా వేక్‌ఫిట్ చాల ప్రయోజనం పొందుతోంది. ఇక IPO విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీకి సిద్ధమవుతున్న కొత్త జనరేషన్ కంపెనీలలో ఇప్పుడు వేక్‌ఫిట్ వచ్చి చేరింది. 2024లో స్విగ్గీ, మోబిక్విక్, ఓలా ఎలక్ట్రిక్ సహా 13 స్టార్టప్‌లు IPOల ద్వారా మొత్తం రూ.29,000 కోట్లు అంటే సుమారు $3.4 బిలియన్లు సేకరించాయి. 2023లో కేవలం 5 స్టార్టప్‌లు మాత్రమే IPOను ప్రారంభించగా, కానీ 2022లో 2 మాత్రమే ఎంట్రీ ఇచ్చాయి.
2025లో IPOల సందడి: ఈ 2025 సంవత్సరంలో కనీసం 25 స్టార్టప్‌లు IPOని తీసుకువస్తాయని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, OYO అండ్ ఫోన్‌పే వంటి కంపెనీలు కూడా రాబోయే సంవత్సరాల్లో IPOని తీసుకురావచ్చు అని అంచనా.


Click it and Unblock the Notifications