Davos 2025: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు దావోస్ వెళ్లారు. అక్కడ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నారు.
అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రులు చేస్తున్న పర్యటన ఫలవంతంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ముందుకొచ్చింది. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దావోస్ లో కీలక పెట్టుబడి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష సాంకేతిక రంగంలో పనిచేస్తున్న కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో ఎంవోయూ జరిగినట్లు వెల్లడైంది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా రానున్న కాలంలో కంపెనీ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయటానికి మార్గం సుగమం అయ్యింది. ఒప్పందం ప్రకారం కంపెనీ కొత్తగా రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయటానికి ముందుకొచ్చింది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్థ స్పేస్ టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతికతను అందిస్తూ విజయం సాధించటం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ యువత ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావటంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.

ఇదే క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం తమకు సంతోషంగా ఉందని స్కై రూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామన్నారు. అమెరికా స్పేస్ ఎక్స్ మాదిరిగానే హైదరాబాదులో రానున్న కాలంలో స్కైరూట్ ఏరో స్పేస్ మంచి గుర్తింపును, కొత్త ఉపాధి అవకాశాలను, తెలంగాణకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఇక్కడి యువత కూడా భావిస్తున్నారు.
Hon'ble Chief Minister Shri @revanth_anumula and IT & Industries Minister Shri @Min_SridharBabu oversaw the signing of a Memorandum of Understanding (MoU) with Skyroot Aerospace, a Hyderabad-based company in the space technology sector.
— Telangana CMO (@TelanganaCMO) January 21, 2025
🚀The MoU envisages that the firm would… pic.twitter.com/L63MSchNSo
వాస్తవానికి స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీని ఇస్రోలో పనిచేసిన మాజీ ఉద్యోగులు 2018లో ప్రారంభించారు. టీ హబ్, టీవర్క్స్ సహాయంతో కంపెనీ కేవలం 10 మంది బృందంతో చిన్న సెటప్ తో ప్రారంభించబడింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ చిన్న ఉపగ్రహ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన చిన్న-లిఫ్ట్ లాంచ్ వెహికల్స్ సొంత సిరీస్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలో సబ్-ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించిన మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications