బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పెళ్లి సీజన్ దగ్గరపడుతుండటంతో ఆభరణాల కొనుగోలు అవసరం ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.1,27,920 దాటింది. వచ్చే దీపావళి, ముహూర్తాల సీజన్ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు అసలు బంగారం కొనాలని అనుకున్న కలను వదిలేసి, ఇమిటేషన్ జ్యువెలరీ వైపు తిరుగుతున్నారు.
చిలకలపూడి కేరాప్ గోల్డ్ : ఇలాంటి పరిస్థితుల మధ్య మచిలీపట్నంకు సమీపంలోని చిలకలపూడి దేశవ్యాప్తంగా బంగారానికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఎన్నో దశాబ్దాలుగా ఇమిటేషన్ జ్యువెలరీ తయారీలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, ఇప్పుడు బంగారం ధరల పెరుగుదలతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, గోల్డ్ ప్లేటెడ్ సెట్లు, నెక్లెస్‌లు, గాజులు, వంకీలు, ఉంగరాలు, పెళ్లికూతురు బ్రైడల్ సెట్లు..ఇలా అసలు బంగారాన్ని పోలిన మెరుపుతో దొరకుతున్నాయి, ఆకర్షణీయమైన డిజైన్లు, బరువులేకుండా తేలికగా ఉండటం వల్ల ఇవి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచే కాదు.. సౌదీ అరేబియా, శ్రీలంక, చైనా, థాయిలాండ్ నుంచి కూడా వ్యాపారులు వచ్చి ఇక్కడి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు చిలకలపూడి జ్యువెలరీ రూ. 100 నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే లభించటం వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.
నైపుణ్యం కలిగిన కళాకారుల చేతిపని: ప్రతి ఆభరణం వెనుక నైపుణ్యం కలిగిన కళాకారుల చేతిపని ఉంటుంది. ఒక బ్రైడల్ సెట్‌ను తయారు చేయడానికి 20 నుంచి 25 మంది కళాకారులు కలిసి పనిచేస్తారు. చివరలో బంగారు పూత పూసి ప్రత్యేక పాలిష్ చేయడం వల్ల ఆభరణం సంవత్సరాల తరబడి అది మెరుపును కోల్పోదు. 1890లలో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ పరిశ్రమ.. ప్రస్తుతం భారీ MSME రంగంగా ఎదిగి వేలాది కుటుంబాలకు జీవనోపాధిని ఇస్తోంది. చిలకలపూడిలో 250 మందికిపైగా తయారీదారులు, 260కిపైగా రిటైల్ షాపులు పనిచేస్తుండటంతో మచిలీపట్నం మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.
బంగారం కంటే ఏమాత్రం తక్కువగా అనిపించదు: గుంటూరుకు చెందిన గృహిణి కట్ట వీణ మాట్లాడుతూ.. మచిలీపట్నం నుండి ఇమిటేషన్ ఆభరణాలను కొనుగోలు చేయడం తమ కుటుంబంలో ఒక సంప్రదాయం అని చెప్పారు. అందం, నాణ్యత, మెరుపు పరంగా అసలు బంగారం కంటే ఏమాత్రం తక్కువగా అనిపించదని, కనీసం రెండు సంవత్సరాల పాటు మరోసారి పూత అవసరం రాదని చెప్పారు.
సాధారణ కుటుంబాలకు దేవుని వరం: హైదరాబాద్‌కి చెందిన శ్రీశైలజా రెడ్డి కూడా ఇలాంటి అనుభవాన్నే పంచుకున్నారు. ఆమె కొనుగోలు చేసిన బ్రైడల్ సెట్ ధర రూ. 10 వేలు మాత్రమే, అదే బంగారంతో చేయాలంటే రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ సాధారణ కుటుంబాలకు దేవుని వరమని అన్నారు.
ఈ పరిశ్రమ విజయరహస్యం ఇదే: మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లు పెద్ద ఎత్తున Chilakalapudi వస్తున్నారని తెలిపారు. ధర తక్కువగా ఉండటం మాత్రమే కాకుండా బంగారం లాగా అద్భుతంగా కనిపించడం ఈ పరిశ్రమ విజయరహస్యం అని ఆయన అన్నారు.
ఈ పరిస్థితుల్లో చిలకలపూడి ఇమిటేషన్ జ్యువెలరీ కేవలం మధ్యతరగతి ఆదాయానికి ఉపశమనం మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు జీవనాధారం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళ, తాజా ఫ్యాషన్‌కు ప్రతీకగా మారింది.
2026లో బంగారం ధరల్లో భారీ పెరుగుదల : ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన అంచనాల(WGC Gold Outlook 2026) ప్రకారం రాబోయే సంవత్సరం 2026లో బంగారం (Gold) ధరల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ETFలు (Exchange Traded Funds) గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ.. గత బుల్ మార్కెట్లతో పోలిస్తే ఈ ETFలలో పెట్టుబడుల ప్రవాహం తక్కువగా ఉంది. అంటే.. ఆర్థిక అనిశ్చితి కొనసాగితే.. పెట్టుబడిదారులు ETFs ద్వారా మరింత బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తద్వారా ధరలు పెరుగుతాయి.
అలాగే భయంకరమైన ఆర్థిక పరిస్థితులు లేదా ప్రపంచవ్యాప్త అనిశ్చితి కొనసాగితే.. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
WGC తో పాటు HSBC వంటి కొన్ని బ్యాంకులు కూడా 2026 నాటికి ఔన్స్‌కు 5,000 డాలర్లు (సుమారు తులం రూ. 4.2 లక్షలు) వరకు చేరుకోవచ్చని అంచనా వేశాయి. గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs) కూడా ఔన్స్‌కు 4,900 డాలర్లు వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications