Free Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒకపక్క ఐపీవోల కోలాహలం కొనసాగుతుంటే మరోపక్క కార్పొరేట్ కంపెనీలు తమ రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, డివిడెండ్ వంటి బహుమతులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్కై గోల్డ్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా మల్టీబ్యాగర్ స్టాక్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించనున్నట్లు ప్రకటించటంతో కంపెనీ షేర్లలో ర్యాలీ నమోదైంది. ప్రధానంగా రత్నాలు, ఆభరణాల తయారీ రంగంలో పనిచేస్తున్న కంపెనీ షేర్లు బీఎస్ఈలో లిస్ట్ అయి ఉన్నాయి. కంపెనీ ఉచిత షేర్ల ప్రకటన తర్వాత స్టాక్ ధర ఇంట్రాడేలో 5 శాతం పెరగటంతో రూ.3606.05కి చేరుకున్నాయి. కంపెనీ అర్హులైన పెట్టుబడిదారులకు 9:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కంపెనీలో రికార్డు తేదీ నాటికి ఒక షేరుకు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఉచితంగా కంపెనీ 9 షేర్లను బహుకరించనుందని వెల్లడైంది.

కంపెనీ ప్రస్తుతం రెండోసారి తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందిస్తోంది. దీనికి ముందు 2022లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను తొలిసారిగా ఇన్వెస్టర్లకు అందించింది. అప్పట్లో ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్న ప్రతి షేరుపై మరో షేరు ఇవ్వబడింది. వాస్తవానికి స్టాక్ లిక్విడిటీని పెంచడానికి, దాని ధరను తగ్గించడానికి కంపెనీ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను జారీ చేస్తోందని తెలుస్తోంది. బోనస్ షేర్లు అందించిన తర్వాత కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు మరింత అందుబాటు ధరలోకి రానున్నాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు స్కై గోల్డ్ కంపెనీ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.
గడచిన 5 ఏళ్ల కాలంలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు 3600 శాతం మెగా రాబడిని అందించింది. నవంబర్ 6, 2019న రూ.90 వద్ద ఉన్న కంపెనీ షేర్లు ప్రస్తుతం ఒక్కోటి రూ.3,606.05కి చేరుకున్నాయి. అలాగే గత రెండేళ్ల కాలంలో 2000 శాతం కంటే ఎక్కువ రిటర్న్ పెట్టుబడిదారులు అందుకున్నారు. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 418% పైగా పెరుగుదలను చూశాయి. కంపెనీ ప్రస్తుతం దీనికి సంబంధించిన రికార్డు తేదీని మాత్రం ప్రకటించలేదు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications