ఆరోవారం లాభాల్లో క్లోజ్: రిలయన్స్ మళ్లీ డౌన్, ఈ స్టాక్స్ ఒత్తిడి
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 11) లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 13,500కు పైన ముగిసింది. సెన్సెక్స్ 139.13 పాయింట్లు(0.30%) లాభపడి 46,099.01 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.60 పాయింట్లు(0.26%) లాభపడి 13,513.90. పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1713 షేర్లు లాభాల్లో, 1188 షేర్లు నష్టాల్లో ముగియగా, 148 షేర్లలో ఎలాంటి మార్పులేదు. రంగాలవారీగా చూస్తే సూచీల మిశ్రమంగా కదిలాయి. ఎనర్జీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు 1 శాతం చొప్పున లాభపడగా, ఫార్మా, ఐటీ, ఆటో రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి 73.66 వద్ద ట్రేడ్ అయింది.

రూ.2000 దిగువకు రిలయన్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 5.62 శాతం, NTPC 5.40 శాతం, గెయిల్ 4.83 శాతం, కోల్ ఇండియా 2.52 శాతం, టాటా స్టీల్ 1.90 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో దివీస్ ల్యాబ్స్ 2.42 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.20 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.17 శాతం, అదానీ పోర్ట్స్ 1.00 శాతం, సిప్లా 0.90 శాతం నష్టపోయింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎస్బీఐ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 0.38 శాతం తగ్గి రూ.1999.40 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ స్టాక్ మళ్లీ రూ.2000 దిగువకు చేరుకుంది.

రంగాలవారీగా..
రంగాలవారీగా..

ఆరోవారం లాభాల్లో..
మార్కెట్లు వరుసగా ఆరోవారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం సెన్సెక్స్ 2.2 శాతం, నిఫ్టీ 1.9 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 1.7%, మిడ్ క్యాప్ సూచీలు 1.2%, నిఫ్టీ PSU బ్యాంకు 7.7%, నిఫ్టీ FMCG 6.2%, నిఫ్టీ మీడియా 4.8%, నిఫ్టీ జూనియయర్ 1.6%, నిఫ్టీ IT 1.6%, నిఫ్టీ ఫార్మా 0.2% లాభపడ్డాయి.
ఇక, నిఫ్టీ ఆటో 1.1%, నిఫ్టీ మెటల్ 0.4% నష్టపోయాయి.


Click it and Unblock the Notifications