Budget News: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇంకో నాలుగు రోజుల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పద్దు ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ బడ్జెట్‌పై వేతన జీవులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అంతకంతకూ పెరుగుతూ పోతున్న ద్రవ్యోల్బణంతో తమ జేబులకు చిల్లు పడుతుండగా.. పలు కీలక ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు.
జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, ఆదాయపు పన్ను రేట్లలో ఉపశమనం మరియు సెక్షన్ 80C మినహాయింపుల పెరుగుదలపై పన్ను చెల్లింపుదారులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో దాదాపు 6 ఆదాయపు పన్ను సంబంధింత మార్పులను ఆశించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

2018 బడ్జెట్‌లో మొదట 40 వేలుగా స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టబడింది. తదనంతరం 2019లో దీన్ని 50 వేలకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎటువంటి మార్పు చేయబడలేదు. సెక్షన్ 80C మినహాయింపుల పరిస్థితి కూడా ఇంతే. 2014 నుంచి ఇప్పటివరకు అలానే కొనసాగుతున్నాయి. జీతం పొందే వ్యక్తులు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని 1.5 లక్షల మేర తగ్గించుకోవడానికి ఈ సెక్షన్ 80Cని ఉపయోగించుకుంటూ ఉంటారు. దీన్ని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
అతిత్వరలో ప్రవేశపెట్టనున్న బడ్టెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచే అవకాశం కనిపిస్తున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లిమిట్‌ను 3 నుంచి 5కి చేర్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త పన్ను విధానం ఫాలో అయ్యే ట్యాక్స్ పేయర్స్‌పై దీని ప్రభావం ఉండనుంది. ఇదే విధానంలోని టాప్ పన్ను శ్లాబ్‌ను 30 నుంచి 25 శాతం తగ్గింపును ప్రభుత్వం పరిగణించవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో పాతపన్ను విధానంలోని అత్యధిక రేటు థ్రెషోల్డ్‌ను 10 నుంచి 20 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) విషయంలోనూ ఈసారి కీలక ప్రకటన వెలవడవచ్చని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న అద్దె ఖర్చుల ప్రభావాన్ని తగ్గించే దిశగా.. HRA మినహాయింపు పరిమితి పెంచే సూచనలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ పెన్షన్ సిస్టమ్(NPS) కోసం సెక్షన్ 80CCD-1B కింద అదనపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే విధంగా మార్పులు ఉండవచ్చని ట్యాక్స్ పేయర్స్ ఆశిస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications