Sensex Stocks: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లోని 10 అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల్లో ఆరు గతవారం తమ మార్కెట్ వాల్యుయేషన్ నుంచి రూ. 1,68,260.37 కోట్ల విలువను కోల్పోయాయి. ప్రధానంగా ఈక్విటీ మార్కెట్‌లో బలహీనమైనత కారణంగా IT దిగ్గజమైన TCS కంపెనీ తీవ్రంగా ప్రభావితమై అత్యధికంగా విలువను కోల్పోయింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ గతవారం 721.06 పాయింట్లను కోల్పోయింది.

ఆవిరైన ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్..
బీఎస్ఈ సూచీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్టాక్ అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. దాని మార్కెట్ విలువ రూ.99,270.07 కోట్లు తగ్గి రూ.10,95,355.32 కోట్లకు చేరుకుంది. కంపెనీ జూన్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో గత వారం TCS షేర్లు పడిపోయాయి. దీనికి తోడు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా తన మార్కెట్ క్యాప్ లో రూ.35,133.64 కోట్ల కోతను చవిచూసింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.6,01,900.14 కోట్లకు చేరుకుంది.

బ్యాంకింగ్ స్టాక్స్ పరిస్థితి ఇలా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.18,172.43 కోట్లు తగ్గి రూ.7,57,659.72 కోట్లకు చేరుకోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.8,433.76 కోట్లు క్షీణించి రూ.4,27,488.90 కోట్లకు చేరుకుంది.ఇదే క్రమంలో.. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,091.62 కోట్లు తగ్గి.. రూ.4,02,121.99 కోట్లకు చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ విలువ రూ.3,158.85 కోట్లు తగ్గి.. రూ.5,22,498.11 కోట్లకు చేరుకుంది.

పెరిగిన ఎల్ఐసీ మార్కెట్ క్యాప్..
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ విలువ రూ.17,128.52 కోట్లు పెరిగి రూ.6,03,551.26 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.6,801.72 కోట్లు పెరిగి మార్కెట్ విలువను రూ.16,24,681.08 కోట్లకు చేరింది. కాగా.. ITC కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,318.81 కోట్లు పెరిగి రూ.3,62,327.81 కోట్లకు చేరగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.316.25 కోట్లు పెరిగి రూ.4,48,157.71 కోట్లకు చేరుకుంది.

టాప్-10 కంపెనీల పరిస్థితి..
టాప్-10 సంస్థల ర్యాంకింగ్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన దేశీయ కంపెనీగా కొనసాగింది. తర్వాత TCS, HDFC బ్యాంక్, HUL, ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, LIC, SBI, HDFC, ITC కంపెనీలు ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications