ముంబై: గత వారం టాప్ 10 కంపెనీల్లో ఆరు రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ను పెంచుకోగా, నాలుగు కంపెనీలు నష్టపోయాయి. ఎం-క్యాప్ పరంగా భారీగా లాభపడిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందంజలో ఉంది. RIL, TCS, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (HUL), ఇన్ఫోసిస్, HDFC మార్కెట్ వ్యాల్యూ పెరగగా, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ITC, ICICI బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.

రిలయన్స్ టాప్ గెయినర్
టాప్ 10లోని 6 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1,03,625.35 కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 572.91 పాయింట్లు లేదా 1.59% పెరిగింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.57,688 కోట్లు పెరిగి రూ.11,90,857.13 కోట్లకు చేరుకుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.17,102.22 కోట్లు ఎగిసి రూ.6,06,867.94 కోట్లకు,
హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ.12,088.43 పెరిగి రూ.5,22,481.19 కోట్లకు,
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.8,499.15 ఎగిసి రూ.8,33,648.55 కోట్లకు,
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ 8,177.58 ఎగిసి రూ.3,32,980.71 కోట్లకు,
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ 69.39 పెరిగి రూ.3,27,189.91 కోట్లకు చేరుకుంది.

నష్టపోయిన 4 కంపెనీలివే
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,041.36 కోట్లు తగ్గి రూ.2,38,838.05 కోట్లకు,
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ 3,491.56 కోట్లు పడిపోయి రూ.3,13,530.88 కోట్లకు,
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.791.52 తగ్గి రూ.2,67,039.65 కోట్లకు,
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.420.94 కోట్లు పడిపోయి రూ.2,33,361.95 కోట్లకు తగ్గింది.

రిలయన్స్ జూమ్
కరోనా కష్టకాలంలోనూ జియో ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడుల వెల్లువ కారణంగా రిలయన్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 3 శాతం పెరిగి రూ.34,195.13 కోట్లను మార్కెట్ క్యాపిటలైజేషన్కు యాడ్ చేసింది. దీంతో రిలయన్స్ వ్యాల్యూ రూ.11,90,857.13 కోట్లకు చేరుకుంది. ఓ సమయంలో 3.27 శాతం పెరిగి షేర్ వ్యాల్యూ రూ.1,884.40 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications