భారత అతివిలువైన 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా క్షీణించింది. పది కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాప్ రూ.1,02,779.4 కోట్లు తగ్గింది. నాలుగు కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. గతవారం భారీగా నష్టపోయిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. వారంలో సెన్సెక్స్ 526.51 పాయింట్లు లేదా 1.29 శాతం మేర నష్టపోయింది. గురువారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం స్వల్పంగా కోలుకుంది.

రిలయన్స్, టీసీఎస్ ఎం-క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.39,355.06 కోట్లు క్షీణించి రూ.14,71,081.28 కోట్లుగా ఉంది. దీంతో రూ.15 లక్షల కోట్ల కిందకు దిగి వచ్చింది.
టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.19,681.25 తగ్గి రూ.10,36,596.28 కోట్లుగా ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.19,097.85 కోట్లు తగ్గి రూ.6,59,894.13 కోట్లుగా ఉంది.
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.12,875.11 క్షీణించి రూ.2,19,067.91 కోట్లు నమోదయింది.
హెచ్‌సీఎల్ టెక్ మార్కెట్ క్యాప్ రూ.7,842.49 పడిపోయి రూ.2,24,447.24 కోట్లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,927.64 కోట్లు క్షీణించి రూ.2,73,075.43 కోట్లుగా ఉంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ అప్
దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,540.12 కోట్లు పెరిగి రూ.4,80,291.25 కోట్లు నమోదయింది.
కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,290.64 కోట్లు పెరిగి రూ.2,64,555.97 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఎంక్యాప్ రూ.2,795.97 కోట్లు ఎగిసి రూ.5,05,330.81 కోట్లుగా నమోదయింది.
హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.502 కోట్లు పెరిగి రూ.3,51,986.24 కోట్లుగా ఉంది.

టాప్ 10 కంపెనీలు
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవలే రూ.10 లక్షల కోట్లను దాటిన టీసీఎస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
ఇన్ఫోసిస్ ఇటీవలే రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటింది. అయితే ఆ తర్వాత ఆ మార్క్ కిందకు దిగి వచ్చింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications