భారత టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం పెరిగింది. పది కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాప్ రూ.86,684 కోట్లు ఎగిసింది. నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. గతవారం భారీగా లాభపడిన కంపెనీల్లో HDFC బ్యాంకు, HDFC ముందున్నాయి. క్రితం వారం 40,500కు దిగువన ఉన్న సెన్సెక్స్ వారంతానికి 40,700 సమీపానికి చేరుకుంది. ఓ సమయంలో 40,900ను దాటి 41వేల సమీపానికి చేరుకుంది. అంతకుముందు గురువారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అలాగే క్రితం వారం మిగతా రోజులు లాభాలు చూసినప్పటికీ, గురువారం స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 702 పాయింట్లు (1.75) శాతం ర్యాలీ చేసింది.

HDFC అదుర్స్, రిలయన్స్, ఇన్ఫీ డౌన్
10 కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాప్ రూ.86,683.71 కోట్లు పెరిగింది. గతవారం లాభపడిన కంపెనీల్లో HDFC బ్యాంకు, HDFC, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.
నష్టపోయిన వాటిలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్ కంపెనీ మార్కెట్ క్యాప్ తగ్గింది.
దేశంలోని టాప్ 2 కంపెనీలు రిలయన్స్, టీసీఎస్ వ్యాల్యూ గతవారం క్షీణించింది.

ఈ కంపెనీల ఎం-క్యాప్ పెరిగింది
- భారత అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.20,198.59 పెరిగి రూ.6,80,092.72కు చేరుకుంది.
- మోర్టగేజ్ లెండర్ HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,146.58 కోట్లు పెరిగి రూ.3,70,132.82 కోట్లుగా నమోదయింది.
- భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.17,894.22 కోట్లు ఎగిసి రూ.2,36,962.13 కోట్లుగా ఉంది.
- ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.14,415.27 కోట్లు పెరిగి రూ.2,87,490.70 కోట్లు నమోదయింది.
-కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.9,204.18 పెరగడంతో రూ.2,73,760.15 కోట్లుగా నమోదయింది.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎం-క్యాప్ రూ.6,824.87 ఎగిసి రూ.2,31,272.11 కోట్లకు చేరుకుంది.
- ఈసారి మార్కెట్ క్యాప్ పెరిగిన 6 కంపెనీల్లో బ్యాంకింగ్ రంగానికి చెందినవే నాలుగు ఉన్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
- మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. ఈ కంపెనీ ఎం-క్యాప్ రూ.42,567.02 కోట్లు క్షీణించి రూ.14,28,514.26 కోట్లకు క్షీణించింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.28,536.89 కోట్లు తగ్గి రూ.10,08,059.39 కోట్లుగా ఉంది.
- ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.2,385.23 కోట్లు పడిపోయి రూ.4,77,906.02 కోట్లుగా నమోదయింది.
- హిందూస్తాన్ యూనీలీవర్మార్కెట్ క్యాప్ రూ.1,574.2 కోట్లు క్షీణించడంతో రూ.5,03,756.61 కోట్లుగా ఉంది.
- టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.86 వేల కోట్లకు పైగా పెరగగా, భారత టాప్ 2 కంపెనీలైన రిలయన్స్, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70వేల కోట్లకు పైగా తగ్గడం గమనార్హం.
- టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్, టీసీఎస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఆ తర్వాత వరుసగా HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, HCL టెక్నాలజీస్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications