మోస్ట్ వ్యాల్యూడ్ టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.72,240 కోట్ల మేర పెరిగింది. ఆదాయంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు నిలిచింది. గత వారం రిలయన్స్‌తో పాటు టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకుల మార్కెట్ క్యాప్ పెరిగింది. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ తగ్గింది.

ఏ కంపెనీ ఎం-క్యాప్ ఎంత పెరిగిందంటే?
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,556.75 కోట్లు పెరిగి రూ.13,60,879.96 లక్షల కోట్లుగా నిలిచింది.
- ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.7,092.05 కోట్లు పెరిగి రూ.2,31,751.90కోట్లకు చేరుకుంది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకు వ్యాల్యూ రూ.6,241.63 కోట్లు పెరిగి రూ.5,74,119.37 కోట్లుగా ఉంది.
- టెక్ దిగ్గజం టీసీఎఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,690.48 కోట్లు పెరిగి రూ.8,61,153.53 కోట్లకు చేరుకుంది.
- భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.3,136.95 కోట్లు పెరిగి రూ.3,05,838.55 కోట్లుగా నమోదయింది.
- ఐటీసీ ఎం-క్యాప్ రూ.2,522.24 కోట్లు పెరిగి రూ.2,41,182.98 కోట్లుగా ఉంది.

ఏ కంపెనీ ఎం-క్యాప్ ఎంత తగ్గింది?
- ఇన్పోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,601.91 కోట్ల మేర తగ్గి రూ.4,04,952.60 కోట్లుగా ఉంది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.5,016.44 పడిపోయి రూ.2,65,584.08 కోట్లకు పరిమితమైంది.
- హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రూ.849.96 కోట్లు తగ్గి రూ.3,08,404.13 కోట్లుగా ఉంది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.505.15 కోట్లు తగ్గి రూ.5,19,426.78 కోట్లకు పరిమితమైంది.

టాప్ 10 కంపెనీలు వరుసగా..
గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 433.68 పాయింట్లు లేదా 1.15 శాతం ఎగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.
రిలయన్స్ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications