టాప్ 10 కంపెనీల్లో ఆరింటి ఎం-క్యాప్ రూ.92,130 కోట్లు అప్: టీసీఎస్ బెస్ట్, రిలయన్స్‌కు నష్టం
గత వారం టాప్ 0 ఇండియన్ కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.92,130.59 కోట్లు పెరిగింది. ఈ వారంలో భారీగా లాభాలు చూసిన సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందుంది. ఆ తర్వాత HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ మార్కెట్ క్యాప్ కూడా మొన్న శుక్రవారంతో ముగిసిన వారంలో పెరిగింది.

టీసీఎస్ సహా ఈ సంస్థల ఆదాయం పెరిగింది
TCS ఆదాయం రూ.25,722.6 కోట్లు పెరిగి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,93,854.51 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ 18,104.7 కోట్లు పెరిగి రూ.3,18,648.65 కోట్లకు, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,614.2 కోట్లు పెరిగి రూ.5,06,198.81 కోట్లకు, ఐటీసీ వ్యాల్యూ రూ.13,521.45 కోట్లు పెరిగి రూ.2,39,821.43 కోట్లకు, HDFC బ్యాంకు రూ.12,460.2 పెరిగి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,79,553.80 కోట్లకు చేరుకుంది. కొటక్ మహీంద్రా బ్యాంకు ఆదాయం రూ.7,707.44 పెరిగి రూ.2,65,347.77 కోట్లకు చేరింది.

నష్టపోయిన టాప్ 4 కంపెనీలు ఇవే
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం రూ.11,996.55 తగ్గి రూ.3,06,600.66 కోట్లకు పడిపోయింది. చాలా రోజుల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ కూడా తగ్గింది. ముఖేష్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఎం-క్యాప్ రూ.10,713.59 పడిపోయి రూ.11,04,704.44 కోట్లకు పరిమితమైంది. ఐసీఐసీఐ రూ.9,645.67 కోట్లు తగ్గి రూ.2,26,002.43 కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్ రూ.6,082.95 తగ్గి రూ.3,05,674.88కు పరిమితమైంది.

రిలయన్స్ టాప్
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడింది.


Click it and Unblock the Notifications