టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.96,642 కోట్లు క్షీణించింది. అంతకుముందు వారం టాప్ ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.76,640.54 తగ్గగా, అంతకుముందు వారంలో మాత్రం రూ.69,611.59 కోట్లు పెరిగింది. టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ వరుసగా రెండో వార్ క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, కొటక్ మహీంద్రా స్టాక్స్ నష్టపోగా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ 388.96 పాయింట్లు లేదా 0.73 శాతం లాభపడింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
- ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,249.32 పతనమై రూ.12,90,330.25 కోట్లుగా నమోదయింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,479.28 పతనమై రూ.11,71,674.52 కోట్లుగా నమోదయింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,511.93 కోట్లు క్షీణించి రూ.3,28,122.93 కోట్లకు చేరకుంది.
- HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.8,653.09 కోట్లు తగ్గి రూ.7,88,769.58 కోట్లకు పడిపోయింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,827.92 కోట్లు క్షీణించి రూ.4,40,738.35 కోట్లు తగ్గింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.5,920.97 కోట్లు తగ్గి రూ.5,48,405.78 కోట్లుగా నమోదయింది.

వీటి ఎం-క్యాప్ జంప్
అదే సమయంలో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,475.58 కోట్లు పెరిగి రూ.6,85,819.28 కోట్లకు చేరుకుంది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,210.38 కోట్లు పెరిగి రూ.4,72,849.46 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫిన్ సర్వ్ ఎం-క్యాప్ రూ.2,972.7 కోట్లు పెరిగి రూ.3,75,972.88 కోట్లకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,275.78 కోట్లు పెరిగి రూ.3,85,275.48 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాప్ పరంగా వరుసగా
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్‌లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL), ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications