ముంబై: మోస్ట్ వ్యాల్యూడ్ టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.78,275.12 కోట్లు క్షీణించింది. టాప్ 2 కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీలు భారీగా నష్టపోవడంతో ఈ ప్రభావం మార్కెట్ క్యాప్ పైన ఎక్కువగా పడింది. గత వారం సెన్సెక్స్ 163.23 పాయింట్లు లేదా 0.42 శాతం క్షీణించింది. గతవారం రష్యా కరోనా వ్యాక్సీన్ వచ్చినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ దేశీయమార్కెట్లు నష్టపోయాయి.

రిలయన్స్ భారీ నష్టం
మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిన కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు.. నాలుగుమాత్రమే ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు నష్టపోయాయి. ఇందులో రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.20.666.46 కోట్లు పడిపోయి రూ.13,40,213.50 కోట్లకు చేరుకుంది. టాప్ 10 మార్కెట్ క్యాప్స్లలో భారీగా నష్టపోయింది రిలయన్స్.

రిలయన్స్ తర్వాత మార్కెట్ క్యాప్ కోల్పోయిన కంపెనీలు
టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.19,700కోట్లు పడిపోయి రూ.8,41,453.51 కోట్లుగా,
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.17,294.12 క్షీణించి రూ.2,88,544.43గా, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,634.6 తగ్గి రూ.5,10,792.18 కోట్లుగా ఉంది. కొటక్ మహీంద్రా ఎం-క్యాప్ రూ.6,728.15పడిపోయి రూ.2,58,855.93 కోట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.5,251.77 కోట్లు తగ్గి రూ.5,68,867.60 కోట్లుగా ఉంది.

మార్కెట్ క్యాప్ పెరిగిన 4 కంపెనీలు
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,609.98 పెరిగి రూ.3,21,014.11 కోట్లుగా, ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,338.16 ఎగిసి రూ.2,34,090.06 కోట్లుగా, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.1,171.31 పెరిగి రూ.4,06,123.91గా, ITC మార్కెట్ క్యాపిటల్ రూ.604.97 పెరిగి రూ.2,41,787.95గా ఉంది.
మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడూ ముందు ఉంటుంది. రిలయన్స్ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్ర బ్యాంకు, ITC, ICICI బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications