యస్ బ్యాంకు డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగబోదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం హామీ ఇచ్చారు. యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన మారటోరియం వల్ల ఏ ఒక్క డిపాజిటర్‌కు కూడా ఇబ్బందులు తలెత్తవన్నారు. ఆర్బీఐ గవర్నర్ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుందన్నారు.
యస్ బ్యాంకుపై ఆర్బీఐ గురువారం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బు విత్ డ్రా కోసం ఏటీఎంల ముందు వరుస కట్టారు. యస్ బ్యాంకు ఖాతాదారులెవరూ తమ ఖాతాల నుంచి నెలకు రూ.50,000కు మించి విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేదని ఆర్బీఐ పరిమితి విధించింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

ఆర్బీఐ ఆదేశాలతో డిపాజిటర్లు ఆందోళనకు గురయ్యారు. విత్ డ్రా కోసం ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. ఏటీఎంలో రాకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించుకోవడం కూడా సాధ్యం కాలేదు. దీంతో ముంబైతో పాటు పలు నగరాల్లోని యస్ బ్యాంకు ఏటీఎంలు మూతపడ్డాయి. ముంబైలోని చెంబూర్ సబర్బన్ రెసిడెన్షియల్ ప్రాంతంలో యస్ బ్యాంకు ఏటీఎం ముందు జనం డబ్బు విత్ డ్రా కోసం బారులు తీరారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications