Ram Mandir Stock: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో చాలా మంది పెట్టుబడిదారులు తమ ఫోకస్ ఐపీవోల నుంచి రామ్ మందిర్ షేర్లపై పడింది. దీంతో అయోధ్య రామ మందిర కార్యక్రమంలో భాగమైన అనేక కంపెనీలకు చెందిన షేర్లు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.
రేపే జనవరి 22. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే అద్భుతమైన దినం. వేల మంది వీవీఐపీలతో పాటు లక్షల మంది భక్తులు రాముడిని చూసేందుకు, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు నగరానికి వెళ్లే సమయం. ఈ క్రమంలో ఇంత భారీ స్థాయిలో వచ్చే యాత్రికుల రక్షణ, భద్రతను పర్యవేక్షించటం అంత సులువు కాదు. ఈ భక్త ప్రవాహాన్ని సక్రమంగా యాత్ర పూర్తయ్యేలా చేయటం క్లిష్టతరమైనదనే చెప్పుకోవాలి.

అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టెలికాం కంపెనీలు టవర్ల సంఖ్యను పెంచతూ కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ క్రమంలో గొప్ప ఈవెంట్ భద్రత బాధ్యతలను SIS సంస్థ దక్కించుకుంది. మే 2022 నుండి రామమందిర నిర్మాణ దశలో తన కీలక పాత్రను భద్రతా సేవల సంస్థ సగర్వంగా ప్రకటించింది. సంప్రదాయ భద్రతా చర్యలకు మించి, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిబ్బందికి బాడీ కెమెరాలు, AI-ఆధారిత CCTV వీడియో అనలిటిక్స్‌తో సహా అత్యాధునిక సాంకేతికతను SIS అయోధ్యకు తీసుకొచ్చింది.
రామమందిరాన్ని భద్రపరిచే బాధ్యతను అప్పగించటంపై SIS మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రితురాజ్ సిన్హా గౌరవాన్ని వ్యక్తం చేశారు. కీలకమైన సాంస్కృతిక, మతపరమైన సంస్థలను రక్షించే వారి మిషన్‌లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. ఈ విషయం బయటకు రావటంతో SIS స్టాక్ ఏకంగా 13 శాతం మేర లాభపడింది. శనివారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 10.53 శాత లాభపడి రూ.515 రేటు వద్ద ముగిసింది.
ప్రస్తుతం కంపెనీ తన వ్యపారాన్ని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా కొనసాగిస్తోంది. కంపెనీ మెుత్తంగా 2,85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. టాప్-10 ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న సంస్థ దేశంలోని 650 జిల్లాల్లో 400 కార్యాలయాలను కలిగి ఉంది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానంలో, భారతదేశంలోని నగదు లాజిస్టిక్స్ విభాగాలలో రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ టైటిల్‌ను క్లెయిమ్ చేస్తుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications