ఐఫోన్ అంటే డిజైన్, ప్రైవసీ, సిరి... కానీ ఇప్పుడు కొత్తగా మరో పేరు జత కాబోతోంది అదే జెమినీ. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. అయితే, ఈ కలయిక వెనుక అసలు కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.

iPhone 17 లాంచ్‌కి ముందే ఆపిల్ పెద్ద నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఆపిల్ తన వాయిస్ అసిస్టెంట్ సిరికి కొత్త AI టచ్ ని ఇవ్వడానికి గూగుల్‌తో చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో గూగుల్ జెమినీ AI టెక్నాలజీని వాడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఆపిల్ AI వ్యూహంలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
ఆపిల్ ఇప్పటికే గూగుల్‌ను సంప్రదించి, తన ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ సర్వర్లలో నడిచే ఒక ప్రత్యేకమైన జెమినీ మోడల్ తయారు చేయమని చెప్పింది. గూగుల్ దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రారంభించిందని సమాచారం. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, ఫైనల్ డీల్ ఇంకా కుదరలేదు.
ప్రైవసీ vs ఇన్నోవేషన్ అనే అంశం ఆపిల్-జెమిని ఒప్పందంలో కీలకంగా మారింది. ఇప్పటివరకు ఆపిల్ ఎప్పుడూ "privacy first" అనే నినాదంతో యూజర్ల నమ్మకాన్ని పొందింది. కానీ ఇప్పుడు గూగుల్ జెమిని వంటి AI మోడల్‌ను ఉపయోగించడం వల్ల, యూజర్ డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు యాక్సెస్ చేస్తారు? అనే ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఆపిల్ మాత్రం ప్రైవసీ విషయంలో తన కఠినమైన పాలసీలను మార్చబోదని చెప్పొచ్చు. అంటే, జెమిని డేటాను ప్రాసెస్ చేసే విధానం కూడా ఆపిల్ ప్రమాణాలకు సరిపోయేలా ఉండాలి. ఒకవైపు కట్టింగ్ ఎడ్జ్ AI ఇన్నోవేషన్‌ను అందించాలి, మరోవైపు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం Apple ఎలా సాధిస్తుంది? చివరికి నిజంగా యూజర్లు సేఫ్‌గా ఉంటారా లేదా అనేది చూడాల్సిందే.
గూగుల్ మాత్రమే కాకుండా, ఆపిల్ OpenAI మరియు ఆంత్రోపిక్ తో కూడా మాట్లాడింది. మొదట ఆంత్రోపిక్‌తో ఒప్పందం కుదిరిదనుకున్నారు కానీ ఖర్చు ఎక్కువవుతుందని ఆపిల్ వెనక్కి తగ్గిందట.
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ హెడ్ క్రెగ్ ఫెడెరిఘి ప్రకారం, కొత్త సిరి పూర్తిస్థాయి రీడిజైన్ అవుతుంది. ఇది యూజర్లకు కేవలం సమాధానాలు ఇచ్చే అసిస్టెంట్‌గా కాకుండా, ఒక వ్యక్తిగత AI కంపానియన్‌గా మారుతుంది. ఈ ఫీచర్ ఆపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో వచ్చే కొత్త AI అప్‌డేట్స్‌లో ముఖ్యమైన భాగం అవుతుంది.
ఆపిల్-గూగుల్ సంబంధం కొత్తది కాదు. ఇప్పటికే గూగుల్, ఆపిల్ డివైజ్‌లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండటానికి ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు చెల్లిస్తోంది. ఇప్పుడు సిరి-జెమినీ డీల్ జరిగితే ఈ సంబంధం మరింత బలపడుతుంది. కానీ దీనిపై కొత్త ఆంటీట్రస్ట్ చర్చలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.
రూమర్స్ ప్రకారం, LLM ఆధారిత సిరి కనీసం 2026లో మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆపిల్ తన సొంత మోడల్‌తో పాటు, ఇతర AI మోడల్‌లను కూడా పరీక్షించి ఏది బాగా పనిచేస్తుందో నిర్ణయించుకుంటుంది.
మొత్తానికి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర స్టార్టప్స్ AI రేసులో వేగంగా పరిగెడుతున్నాయి. ఈ పోటీలో వెనుకపడకూడదనే ఉద్దేశంతో ఆపిల్ కూడా అడుగులు వేస్తోంది. అయితే ఆపిల్ స్టైల్ మాత్రం ఒకటే పూర్తిగా టెస్ట్ చేసి, యూజర్లకు సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగపడేలా టెక్నాలజీని మార్కెట్‌లోకి తీసుకురావడం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications