SIP Negative Returns: దేశీయ ఇన్వెస్టర్లు గడచిన కొన్ని నెలలుగా ఈక్విటీల్లో కంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి కారణం మంచి ఆకర్షణీయమైన లాభాలను అందుకోవటమే. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
వివరాల్లోకి వెళితే గడచిన కొన్ని త్రైమాసికాలుగా భారతీయ పెట్టుబడిదారులు ఎక్కువగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి అనుగుణంగానే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా అనేక కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టాయి. తక్కువ కనీస పెట్టుబడి మెుత్తంతో ఎస్ఐపీని ప్రారంభించటానికి కంపెనీలు వెసులుబాటు కల్పించటం కూడా దీనికి కారణం. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లపై అవగాహన లేని చాలా మంది రిస్క్ తీసుకోకుండా రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల పతనం సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక సంఖ్యలో ఫండ్ యూనిట్లను పొందేందుతు తమ వద్ద ఉన్న డబ్బును మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో కుమ్మరించారు. అయితే రోజురోజుకూ మార్కెట్ల పతనం తీవ్రతరం కావటం పెట్టుబడిదారులను నష్టాల్లోకి నెట్టేసింది. భారీతయ స్టాక్ మార్కెట్లు గత ఏడాదిలో బుల్ జోరును కొనసాగించినప్పుడు బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పరుగులతో లాభాలను అందించాయి. ఇదే క్రమంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ద్వారా భారీ రాబడులను కూడా అందుకున్నారు.
నిండా ముంచిన ఫండ్స్..
అయితే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి రోజులు ముగిసిపోయాయని తెలుస్తోంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ కేటగిరీ కింద ఉన్న 29 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ క్రమంలో కొన్ని ఫండ్స్ పనితీరును పరిశీలిస్తే.. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 4 నెలల్లో 10 శాతం నష్టపోగా, ఆదిత్య బిర్లా SL స్మాల్ క్యాప్ ఫండ్ 42 శాతానికి పైగా నష్టాన్ని మిగిల్చింది. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా దాదాపు 41 శాతానికి పైగా నెగటివ్ రాబడిని అందించింది. ఇదే కేటగిరీకి చెందిన అనేక ఇతర ఫండ్స్ దాదాపు 35 శాతం వరకు నష్టాన్ని మిగిల్చాయి.
నిపుణులు ప్రస్తుత తరుణంలో కొత్త పెట్టుబడుల గురించి ఎలాంటి సూచనలు చేయటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్స్ ప్రకటించటం గ్లోబల్ మార్కెట్లను కుదేలు చేస్తోంది. ఈ క్రమంలోనే గడచిన కొన్ని రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా పతనాన్ని చూశాయి. దీనికి అనుగుణంగా పెట్టుబడిదారులు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ విషయంలో విచక్షణ ఉపయోగించాలని వారు చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications