For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాదాపు రెండేళ్ల నెలల కనిష్టానికి SIP పెట్టుబడులు

|

సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా ఫండ్స్‌లో చేరే పెట్టుబడులు జూలైలో 22 నెలల కనిష్టానికి చేరుకుంది. మార్కెట్ ఊగిసలాట ధోరణి నేపథ్యంలో రూ.7,831 కోట్లకు క్షీణించాయి. నాలుగు నెలలుగా SIP పెట్టుబడులు తగ్గుతున్నాయి. అయితే మార్కెట్లో SIPకు తక్కువ నష్టభయం ఉండటంతో ఇన్వెస్టర్లు దీనికే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. SIPపై ఆదారపడే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుండి రూ.2,480 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ డేటా ఆధారంగా తెలుస్తోంది.

ట్యాక్స్‌పేయర్ చార్టర్.. పన్ను చెల్లింపుదారుకు ప్రయోజనం: ఏమిటీ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్?ట్యాక్స్‌పేయర్ చార్టర్.. పన్ను చెల్లింపుదారుకు ప్రయోజనం: ఏమిటీ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్?

గత నెలలో రూ.7,831 కోట్ల పెట్టుబడులు సిప్ ద్వారా రాగా, సెప్టెంబర్ 2018 తర్వాత ఇదే కనిష్టం. అప్పుడు పెట్టుబడుల ద్వారా రూ.7,727 కోట్లు వచ్చాయి. జూన్ నెలలో రూ.8,000 కోట్ల లోపు వచ్చాయి. ఇది 2018 నవంబర్ తర్వాత కనిష్టం. జూన్ నెలలో రూ.7,917 కోట్లు, మే నెలలో రూ.8,123 కోట్లు, ఏప్రిల్ మాసంలో రూ.8,376 కోట్లు, మార్చిలో రూ.8,641 కోట్లుగా ఉంది. కాగా నాలుగేళ్ల తర్వాత పెట్టుబడులు ఔట్ ఫ్లో ఇదే మొదటిసారి.

 SIP inflows hit 22 month low in July at Rs 7,831 crore

2019-20 ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులు రూ.లక్ష కోట్లకు పైగా నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.92వేల కోట్లకు పైగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.67వేల కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.44వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

English summary

దాదాపు రెండేళ్ల నెలల కనిష్టానికి SIP పెట్టుబడులు | SIP inflows hit 22 month low in July at Rs 7,831 crore

Investments in mutual funds through Systematic Investment Plans (SIPs) hit a 22 month low of Rs 7,831 crore in July amid market volatility.
Story first published: Friday, August 14, 2020, 18:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X