Hyderabad News: హైదరాబాద్ ఐటీకి మహర్థశ.. కొత్తగా సింగపూర్ కంపెనీ పెట్టుబడి, ఉద్యోగాల వరద..
IT Park News: హైదరాబాదులో ఐటీ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ఈ క్రమంలో దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి టెక్ కంపెనీలను నగరం ఆకర్షిస్తోంది. నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో కొత్త పెట్టుబడులు నిరంతరం వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాదులో మరో టెక్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రియరియల్ ఎస్టేట్ పెట్టుబడి అభివృద్ధి సంస్థ క్యాపిటాల్యాండ్ గ్రూప్ కన్ను హైదరాబాదుపై పడింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన పెట్టుబడికి తెలంగాణలోని హైదరాబాదును ఎంచుకుంది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ.450 కోట్ల పెట్టుబడిగా పెట్టనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత తాజా ప్రకటన వెలువడింది.

ప్రముఖ బిజినెస్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో.. వృద్ధిని బలోపేతం చేయడం రాబోయే ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ విస్తృత అభివృద్ధి పైప్‌లైన్‌లో భాగంగా వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ-చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్యాపిటల్ గ్రూప్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, ఆఫీస్, లాడ్జింగ్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లతో పాటు మరిన్నింటిని కలిగి ఉంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్షిప్ మద్దతుతో హైదరాబాద్ వ్యాపార వృద్ధికి బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని క్యాపిటల్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో, ఈడీ గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి హైదరాబాద్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుందన్నారు. అందుకే స్థిరమైన వృద్ధితో కూడిన హైదరాబాదులో విస్తరించటానికి ప్రస్తుతం తమ కంపెనీ అడుగులు వేస్తోందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో మూడు ప్రముఖ వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది. International Tech Park Hyderabad, aVance Hyderabad, CyberPearl పేరుతో ఇవి కొనసాగుతున్నాయి. అలాగే కంపెనీ గతంలో ప్రకటించిన 25 MW ఐటీ లోడ్ డేటా సెంటర్ 2025 మధ్య నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని తెలుస్తోంది. తాజా పరిణామాలు దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకమైన నోడ్‌గా హైదరాబాద్ ఆవిర్భావాన్ని నొక్కి చెబుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH)లో రెండవ దశ పునరాభివృద్ధి 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications