Manipal Hospital's: మణిపాల్ హాస్పిటల్స్‌కు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హాస్పిటల్స్ చైన్ ఉంది. అయితే ఇందులో వాటాలను కలిగి ఉన్న ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టెమాసెక్ తాజాగా తన పెట్టుబడులను పెంచుకుని రికార్డు సృష్టించింది. సింగపూర్ కు చెందిన ఈ సంస్థ తాజాగా రూ.16,000 కోట్లను ఇన్వెస్ట్ చేయటంతో.. మణిపాల్ హాస్పిటల్స్‌లో కంట్రోలింగ్ షేర్‌హోల్డర్‌గా అవతరించింది.
దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు పెట్టడంతో భారీ డీల్ నమోదైంది. పాన్-ఇండియా హాస్పిటల్ చైన్ విలువ రూ.40,000 - రూ.42,000 కోట్లు విలువైనదిగా పరిగణించబడుతోంది. టెమాస్క్ మరియు మణిపాల్ గ్రూప్ తమ దేశీయ ఆసుపత్రి ఆస్తుల పోర్ట్‌ఫోలియోను ఏకీకృతం చేస్తాయా? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా IPO ఎప్పుడు తేలే అవకాశం ఉంది? మణిపాల్ హాస్పిటల్స్ యొక్క M&A రాడార్‌లో ఇతర హాస్పిటల్ ఆస్తుల స్థితి ఏమిటి? వంటి ప్రశ్నలకు ఛైర్మన్ డాక్టర్ రంజన్ పాయ్ బదులిచ్చారు.

భారతదేశంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించాలనే దృక్పథంతో 1991లో బెంగళూరులో మొదటి ఆసుపత్రిని డాక్టర్ రాందాస్ పాయ్ స్థాపించారు. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో 650 పడకల ఫ్లాగ్‌షిప్ ఆసుపత్రిని నిర్మించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29 ఆసుపత్రుల్లో 8,000 కంటే ఎక్కువ పడకలు ఉన్నాయి. దాదాపు 32 ఏళ్లుగా మణిపాల్ శక్తివంతంగా మారింది. రాబోయే 2-3 సంవత్సరాలలో కొన్ని గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులను జోడించాలని సంస్థ భావిస్తోంది.
గత ఆరేళ్లుగా టెమాసెక్ మణిపాల్ హాస్పిటల్స్‌లో పెట్టుబడిదారుగా ఉంది. ఆరోగ్య సంరక్షలో పెట్టుబడులకు అవసరమైన మూలధనాన్ని సేకరించటంలో భాగంగా ఇప్పటికే ఉన్న భాగస్వామితో కలిసి ముందుకు సాగాలని మణిపాల్ యాజమాన్యం నిర్ణయించింది. ఇది దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల విభాగం దీర్ఘకాలిక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. తాజా పెట్టుబడుల తర్వాత బోర్టులో ఎక్కువ మెజారిటీ టెమాసెక్ చేతికి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications