వామ్మో..లక్షా ముప్ఫై వేలకు వెండి, ఇప్పుడు పెట్టుబడి పెడితే లాభాలే లాభాలు..ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే..

Silver Rate Today June 9, 2025: ఇప్పటిదాకా ఆభరణాల ప్రియులను బంగారం వణికిస్తే..తాజాగా వెండి చుక్కలు చూపిస్తోంది. బంగారం ధరలు ఆకాశం నుంచి నేల చూపులు చూస్తుండగా వెండి మాత్రం నేల నుంచి ఆకాశం వైపు తన చూపును విసిరింది. పసిడి ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతుంటే సిల్వర్ ధరలు మాత్రం పైకి ఎగబాకుతున్నాయి. బంగారానికి పోటీగా తగ్గేదేలే అంటూ వెండి పరుగులు పెడుతోంది. పసిడి ధర లక్ష రూపాయలు దాటితే వెండి కూడా ఏకంగా లక్ష దాటి దానికి భారీగానే సవాల్ విసురుతోంది.

భారతదేశంలో వెండి ధరలు సోమవారం (జూన్ 9) కిలోకు రూ.1,06,400 చేరుకుని కొత్త రికార్డు సెట్ చేశాయి. ఇప్పటివరకు ఇండియాలో ఈ స్థాయిలో వెండి ధరలు పెరగలేదు. తొలిసారిగా ఈ వెండి ధరల పెరుగుదలను అభరణాల ప్రియులు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ఎదురవుతున్న ఒడిదుడుకులు, నెలకొన్ని అనిశ్చితి పరిస్థితులు, చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

గత వారంలోనే వెండి ధర దాదాపు బంగారం ధరను అధికమించి 9 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఏప్రిల్ నెల నుంచి వెండి దాదాపు బంగారంతో పాటు పెరుగుతూనే వస్తోంది.ఎలక్ట్రానిక్ రంగంలో వెండి వినియోగం పెరగడంతో ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. ఇక సోలార్ ప్యానెల్స్, ఇతర తయారీ వస్తువులైన ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్స్ వీటన్నింటిలో వెండి భాగం కావడంతో బలమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో వెండి ధర ఔన్సుకు 34.70 డాలర్లుగా ఉంది. పారిశ్రామిక రంగానికి వెండి నిత్యావసరం కావడంతో దాని పెరుగుదలకు అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే బలహీనమైన అమెరికా ఆర్థిక సూచికలు బంగారం, వెండి ధరలకు కారణం అవుతున్నాయి. అలాగే రోజు రోజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం, పెరుగుుతన్న విద్యుత్ వాహనాల డిమాండ్, సౌరశక్తి వినియోగంపై పెరుగుతున్న శ్రద్ధ వంటి వాటితో పారిశ్రామికంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తగ్గుతున్న US డాలర్ తో వెండి ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే జోరు కొనసాగితే భవిష్యత్తులో వెండి ధరలు లక్షా ముఫ్పై వేలకు పైగా చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి వెండి ధరలు కొండెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెండిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వెండిలో ఎలా పెట్టుబడి పెట్టాలంటే : వెండిలో పెట్టుబడి పెట్టడానినికి అందరూ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని డబ్బులోకి మార్చుకోవాలంటే మళ్లీ వాటిని నగల షాపుల్లో విక్రయించాల్సి రావొచ్చు. అయితే ఇలాంటి అవసరం లేకుండా కేవలం డిజిటల్ రూపంలో వెండిలో పెట్టుబడి పెట్టడానికి పలు మార్గాలున్నాయి. తద్వారా మీరు నేరుగా నగదును పొందే అవకాశం ఉంది.

ఇందు కోసం మీరు Silver ETFs (Exchange Traded Funds)లో పెట్టుబడి పెట్టవచ్చు. వెండి ETF అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇది భౌతిక వెండి ధరను ట్రాక్ చేస్తుంది. ఒక సాధారణ మ్యూచువల్ ఫండ్ లాగానే, ఈ ETF కూడా బహుళ పెట్టుబడిదారుల నుండి నిధులను సమీకరిస్తుంది.అలాగే Silver Mutual Fundsలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

దీంతో పాటుగా Silver Futures (Commodity Trading)లో ఎంసీఎక్స్ ట్రేడింగ్ ద్వారా కూడా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించవచ్చు. దీంతో పాటుగా Digital Silver Wallets, Fintech Apps వంటి యాప్స్ కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇవి సిల్వర్ ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేసేందుకు మీకు అందుబాటులో ఉన్నాయి.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+