చేతికి చిక్కనంటున్న వెండి.. బంగారం కన్నా భారీగా పెరిగిన ధరలు..కారణం ఏంటంటే..

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం, సరఫరా కొరత ఉద్రిక్తతల నడుమ స్పాట్ మార్కెట్లో వెండి ధరలు సోమవారం నాడు కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. గత శుక్రవారం నమోదు చేసిన గరిష్ట స్థాయిని అధిగమిస్తూ..వెండి ధర 1.4 శాతం పెరిగి ఔన్సుకు 57.29 డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. డేటా సెంటర్ లోపం కారణంగా చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME) లో ట్రేడింగ్ గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం కారణంగా మార్కెట్‌లో తీవ్రమైన అస్థిరత నెలకొంది.

నివేదికలో పేర్కొన్నట్లుగా.. కమెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులు నిలిచిపోవడంతో తమ రిస్క్‌లను హెడ్జ్ చేసుకోవాల్సిన అనేక మంది వ్యాపారులు ఫోన్ ద్వారా బ్రోకర్లు, డీలర్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ పరిస్థితి సరఫరా భయాలను మరింత పెంచి, ధరలను చరిత్రాత్మక స్థాయికి నెట్టింది.

silver price today silver lifetime high silver record high 2025 silver supply shortage silver demand surge silver industrial demand silver EV industry demand silver renewable energy demand silver futures price silver spot price silver shortage 2025 silver price forecast commodity market news precious metals rally gold vs silver price silver investment India MCX silver price today silver global market silver trading news silver supply crisis silver price today India silver price 2025 silver MCX silver investment precious metals market

2025లో వెండి ధరల పెరుగుదలకి ప్రధాన కారణం పారిశ్రామిక డిమాండ్ భారీగా పెరగడంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ఎనర్జీ ప్యానెల్స్, 5G పరికరాలు, ఇతర హై-టెక్ పరిశ్రమల్లో వెండి వినియోగం అధికం కావడంతో సరఫరా-డిమాండ్ అసమతుల్యతను తీవ్రతరం చేసింది. ఈ పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో Silver ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.

వెండి ధరలు వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో పెరుగుతూ..2025 ప్రారంభం నుంచి దాదాపు రెట్టింపు అయి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ మార్కెట్లలో వెండి సరఫరా తక్కువగా ఉండటం మరో కీలక అంశంగా చెప్పుకోవచ్చు. షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్‌కు అనుబంధ గిడ్డంగులలో నిల్వలు దాదాపు గత దశాబ్దంలోనే అతి తక్కువ స్థాయిలో ఉన్నాయని సమాచారం. లండన్ మార్కెట్‌లో భారీగా వెండి ప్రవాహం ఉన్నప్పటికీ ఒక నెలపాటు లోహాన్ని అరువు తీసుకునే (leasing cost) ఖర్చు నిరంతరం పెరుగుతుండటం సరఫరా ఒత్తిడిని సూచిస్తోంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒత్తిడులు కూడా లోహాల ధరలను పెంచే దిశగా పనిచేశాయి. US లేబర్ మార్కెట్ బలహీనపడటం, ఆరు వారాల ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఆర్థిక డేటా విడుదలల్లో ఆలస్యం రావడం, డిసెంబర్‌లో US ఫెడ్ మరో 25 బేసిస్ పాయింట్ల రేటు కోత చేసే అవకాశాలను పెంచుతోంది. అక్టోబర్‌లో ఇప్పటికే 25bps రేటు కోత చేసిన ఫెడ్, మరొక కోతపై స్పష్టత ఇవ్వకపోయినా, ప్రస్తుతం మార్కెట్లు డిసెంబర్‌లో వడ్డీరేటు తగ్గింపు పూర్తిగా ధర నిర్ణయించుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 9-10 తేదీల్లో సమావేశం కానుంది. దీంతో పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+