వెండి ధరలు గత కొంత కాల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యులకు షాకిస్తూ బంగారంతో పోటీపడి మరీ ధరలు నింగిని తాకాయి. అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వెండి ధరలు కిలోకు సుమారు రూ.16 వేల వరకు పెరిగిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు మొగ్గుచూపడంతో ఈ రోజు ధరల్లో స్వల్ప సవరణ కనిపించింది. ఈ ధరల తగ్గుదల వెండి మార్కెట్‌లో తాత్కాలిక దిద్దుబాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా ధరల ప్రకారం గురువారం వెండి ధర కిలోకు రూ.2,52,000గా నమోదైంది. ఇది మునుపటి ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే కిలోకు రూ.5,000 తగ్గింది. ఇదే సమయంలో గ్రాము వెండి ధర రూ.252గా ఉంది, ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.5 తక్కువ. 10 గ్రాముల వెండి ధర రూ.2,570 నుంచి రూ.2,520కి తగ్గగా, 8 గ్రాముల వెండి ధర రూ.40 తగ్గి రూ.2,016 వద్ద ట్రేడవుతోంది.

ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా MCXలో వెండి ధరలు కిలోగ్రాముకు సుమారు రూ.9 వేల వరకు పడిపోగా, బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,370 మేర తగ్గాయి. ఈ పరిణామం ముఖ్యంగా వెండిని పెట్టుబడిగా లేదా ఆభరణాల కోసం కొనాలనుకుంటున్న వారికి అలర్ట్ అయ్యే పరిస్థితులు కల్పించాయి. ఎందుకంటే, అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు వెండి ధరలు ఇంకా దిగివచ్చే అవకాశముందని సూచిస్తున్నాయి.
మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రస్తుతం వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్ల స్థాయిని నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఇది వెండి మార్కెట్ బలహీనతను సూచించే ప్రధాన సంకేతంగా భావిస్తున్నారు. తాజాగా వెండి ధర 78 డాలర్ల స్థాయికి దిగివచ్చిన నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మరింత పెద్ద స్థాయి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. TD సెక్యూరిటీస్ ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. మార్చి ఫ్యూచర్స్‌లో వెండి ధరలు ఔన్సుకు 40 డాలర్ల వరకు పడిపోవచ్చనే అంచనాతో బ్యాంక్ స్వల్ప వైఖరిని తీసుకున్నట్లు వెల్లడించింది.
TD సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ అయిన డేనియల్ వెండి మార్కెట్‌పై పెద్ద షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. ఆయన మార్చి సిల్వర్ ఫ్యూచర్స్‌ను ఔన్సుకు 78 డాలర్ల వద్ద షార్ట్ చేసి, ప్రత్యక్ష లక్ష్యంగా 40 డాలర్లని నిర్దేశించారు. అంటే, రాబోయే మూడు నెలల వ్యవధిలో వెండి ధరలు దాదాపు సగానికి తగ్గవచ్చని ఆయన అంచనా. గత కొన్ని నెలలుగా Silver ధరలు వేగంగా పెరిగి ఔన్సుకు 84 డాలర్ల రికార్డు స్థాయిని తాకినప్పటికీ.. ఇప్పుడు ఆ పెరుగుదలకి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.
TD సెక్యూరిటీస్ అంచనాలు నిజమైతే.. వెండిని తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఏర్పడవచ్చు. అయితే, కేవలం ధరలు తగ్గుతున్నాయనే కారణంతో వెంటనే కొనుగోలు చేయడం ప్రమాదకరమవుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉండటం వల్ల ధరలు రోజురోజుకే కాకుండా గంటగంటకూ మారే అవకాశం ఉంటుంది.
ఇక అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే.. రాబోయే రెండు వారాల్లో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా కామెక్స్ వెండి మార్కెట్‌లోని ఓపెన్ ఇంట్రెస్ట్‌లో దాదాపు 13 శాతం అమ్ముడుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మార్కెట్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంది. అదనంగా, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వెండిపై సుంకాలు విధించవచ్చన్న భయంతో గత కొన్ని నెలలుగా పెద్ద మొత్తంలో వెండి అమెరికాలోనే నిలిచిపోయింది.
అయితే, అలాంటి సుంకాలు విధించబడవని TD సెక్యూరిటీస్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ అనిశ్చితి తొలగిన వెంటనే అక్కడ ఆగిన వెండి అంతర్జాతీయ మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశిస్తే, సరఫరా పెరిగి ధరలపై మరింత ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో కూడా TD సెక్యూరిటీస్ వెండి ధరలపై ప్రతికూల అంచనాలు వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో బ్యాంక్ వెండి ధరలను తగ్గిస్తూ అంచనా వేయగా, ఆ తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. బ్యాంక్ సుమారు 2.4 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. అందువల్ల, ఒకే నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే, మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, కొంత సమయం వేచి చూడటం పెట్టుబడిదారులకు మేలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications