గత వారం అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. వారం ప్రారంభంలో ఒత్తిడిలో ఉన్న COMEX వెండి ధరలు శుక్రవారం ఒక్కరోజులోనే 5.59 శాతం లాభపడి చివరికి ఔన్సుకు 79.341 డాలర్ల వద్ద ముగిశాయి. గత వారం ముగింపు ధర 71.300 డాలర్లతో పోలిస్తే.. వారానికి 11.27% లాభం నమోదవడం గమనార్హం. దేశీయ మార్కెట్లో కూడా MCX వెండి మార్చి 2026 ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధరలు కిలోకు రూ. 2,52,000 వద్ద స్థిరపడ్డాయి.
ఈ పెరుగుదలకు ప్రధాన కారణం US డాలర్ బలహీనతగా చెప్పవచ్చు. వారమంతా బలంగా ఉన్న డాలర్, వారాంతంలో లాభాల బుకింగ్ కారణంగా తగ్గుముఖం పట్టడంతో బులియన్ మార్కెట్లకు ఊపునిచ్చింది. అదే సమయంలో, వెండి ధరలు ఇటీవల నమోదు చేసిన 82.37 డాలర్ల రికార్డు స్థాయి నుంచి కొంత వెనక్కి తగ్గడం, సమీప భవిష్యత్తులో వెండి 100 డాలర్లని తాకుతుందా? అనే చర్చకు దారితీసింది. భారత మార్కెట్లో కూడా Silver ధరలు 3 లక్షల రూపాయల స్థాయికి చేరతాయా అన్న ఉత్కంఠ ట్రేడర్లలో నెలకొంది.

కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెండి ధరల పెరుగుదల వెనుక డిమాండ్-సరఫరా సమతుల్యంలో నిర్మాణాత్మక మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా-వెనిజులా మధ్య పెరుగుతున్న వివాదం కారణంగా పెరూ, చాడ్ వంటి దేశాల నుంచి వెండి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా 2026 జనవరి 1 నుంచి చైనా వెండి ఎగుమతులపై నిషేధం విధించే అవకాశం కూడా సరఫరాపై ఒత్తిడిని పెంచుతోంది.
మరోవైపు.. ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), సౌరశక్తి ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్స్, అలాగే AI సంబంధిత పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ వెండిపై భారీ ఒత్తిడిని సృష్టిస్తోంది. ఈ కారణాల వల్ల వెండి ధరలు పదునైన పెరుగుదల చూపుతున్నప్పటికీ.. నిపుణులు ఈ ర్యాలీ ఎప్పటికైనా టాప్ అవుట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయెల్ ప్రకారం.. US సుప్రీంకోర్టు ట్రంప్ సుంకాలపై తీసుకునే నిర్ణయం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సుంకాల విషయంలో అనిశ్చితులు తొలగితే బులియన్ ధరలకు మద్దతు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, ఫిబ్రవరి చివరి నాటికి బులియన్ మార్కెట్ టాప్ అవుట్ అయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అన్నారు.
COMEX వెండి ధరలకు 70 డాల్లర కీలక మద్దతు ఉండగా.. 84 డాలర్ల నుంచి 90 డాలర్ల వద్ద బలమైన అడ్డంకులు ఉన్నాయి. ఇవి అధిగమిస్తేనే 100 డాలర్ల లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. దేశీయంగా MCX వెండి ధరకు రూ. 2,30,000 కీలక మద్దతుగా ఉండగా.. రూ. 2,65,000 నుంచి రూ. 2,90,000 ప్రధాన రెసిస్టెన్స్ స్థాయి (ఆగిపోయే లేదా తగ్గే అవకాశం ఎక్కువగా ఉండే ధర స్థాయి)లుగా పేర్కొన్నారు. ఈ అడ్డంకులు దాటితే, రాబోయే నెలల్లో రూ. 3 లక్షల మార్క్ సాధ్యమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications