ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితి బంగారం, వెండి లోహాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2.1 శాతం పెరిగి 5,511.79 డాలర్లకి చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధర 5,591.61 డాలర్ల వరకు ఎగబాకి కొత్త రికార్డును నెలకొల్పింది.
ధరలు కొంత ఊగిసలాట చూపినప్పటికీ.. మొత్తం ధోరణి మాత్రం బలంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం వెండి ధర ఔన్సుకు 1.3 శాతం పెరిగి 118.061 డాలర్లకు చేరుకోగా.. అంతకుముందు సెషన్‌లో 119.34 డాలర్ల స్థాయిని తాకి ఆల్‌టైమ్ హై నమోదు చేసింది.
వెండి ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 60 శాతం కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేశాయి. భారత మార్కెట్లలో కూడా ఇదే ప్రభావం స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయంగా COMEX మార్కెట్‌లో బలమైన గ్యాప్-అప్ ఓపెనింగ్ తర్వాత, దేశీయంగా MCX వెండి ధర కూడా అప్‌సైడ్ గ్యాప్‌తో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో వెండి ధర కిలోకు రూ. 4,07,456 వరకు ఎగబాకి కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఈ ర్యాలీతో MCX వెండి ధర తొలిసారిగా కిలోకు రూ. 4 లక్షల మార్క్‌ను దాటడం విశేషంగా మారింది.

గత ఒక సంవత్సరంలో వెండి ధరలు దాదాపు 188 శాతం వరకు పెరగడం పెట్టుబడి మార్కెట్లలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ICICI ప్రుడెన్షియల్ AMCలో ప్రిన్సిపల్, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీగా పనిచేస్తున్న చింతన్ హరియా వెండి పెట్టుబడులపై కీలక విశ్లేషణ చేశారు. ఆయన ప్రకారం, వెండిపై దీర్ఘకాలిక పెట్టుబడి కేసు ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది.. ఆర్థిక, భౌగోళిక అనిశ్చితి కాలాల్లో వెండి ఒక హెడ్జ్ ఆస్తిగా పనిచేయగలగడం. రెండోది.. పారిశ్రామిక రంగ వృద్ధితో వెండికి ఉన్న బలమైన అనుసంధానం.
అయితే, ఇటీవలి కాలంలో Silver ధరలు చాలా వేగంగా పెరగడం వల్ల స్వల్పకాలిక అస్థిరత ప్రమాదం పెరిగిందని హరియా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత స్థాయిల వద్ద కొత్తగా ఏకమొత్తం (లంప్‌సమ్) పెట్టుబడులు పెట్టేటప్పుడు పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సాధారణంగా పదునైన ర్యాలీలు తరువాత ధరలు కొంత సరిదిద్దుకునే (డ్రాడౌన్) అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.
వెండిలో ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్‌పోజర్ లేని పెట్టుబడిదారులు, ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా క్రమంగా, దశలవారీగా పొజిషన్‌లను నిర్మించుకునే విధానాన్నిఅనుసరించవచ్చని హరియా సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే వెండిలో పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడులను మొత్తం పోర్ట్‌ఫోలియో ఆస్తి కేటాయింపు ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా సమీక్షించుకోవడం అవసరమని ఆయన చెప్పారు.
వెండి ధరలు భారీగా పెరిగిన తర్వాత రీబ్యాలెన్సింగ్ (పునఃసమతుల్యం) ఎందుకు ముఖ్యమో కూడా హరియా వివరించారు. ఒక ఆస్తి విలువ గణనీయంగా పెరిగితే, అది పోర్ట్‌ఫోలియోలో ఉద్దేశించిన శాతం కంటే ఎక్కువ బరువు పొందుతుంది. అలాంటి సందర్భాల్లో ఎక్స్‌పోజర్‌ను కొంత తగ్గించడం వల్ల రిస్క్ నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఇప్పటికే వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీబ్యాలెన్సింగ్ అనేది ధరలు పడతాయనే అంచనాతో చేసే పని కాదని, అది కేవలం రిస్క్ మేనేజ్‌మెంట్ చర్య మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి ర్యాలీ కారణంగా FOMO (మిస్ అవుతామనే భయం) ప్రభావంతో సిల్వర్ ETFలలోకి భారీగా నిధులు ప్రవహించే ప్రమాదం కూడా ఉందని హరియా హెచ్చరించారు. ఇలాంటి ఆలస్య దశలో వచ్చే పెట్టుబడులు మార్కెట్‌లో పొజిషనింగ్‌ను కిక్కిరిసేలా చేసి, స్వల్పకాలిక ధరల సవరణలను మరింత తీవ్రతరం చేయవచ్చు. సమీప భవిష్యత్తులో సిల్వర్ ETFలు గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు, US వడ్డీ రేట్ల అంచనాలు, కరెన్సీ కదలికలతో కూడిన అస్థిరతను ఎదుర్కొనే అవకాశముంది.
దీర్ఘకాలికంగా చూస్తే, సౌరశక్తి, విద్యుదీకరణ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పెరుగుతున్న వినియోగం వల్ల వెండి డిమాండ్‌కు నిర్మాణాత్మక మద్దతు ఉందని హరియా తెలిపారు. అయితే పారిశ్రామిక డిమాండ్ చక్రీయ స్వభావం కలిగి ఉండటంతో, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించే కాలాల్లో డిమాండ్ తగ్గే అవకాశమూ ఉందని హెచ్చరించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం.. సిల్వర్ ETFలు లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి నియంత్రిత పెట్టుబడి సాధనాలు ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గమని హరియా అభిప్రాయపడ్డారు.సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని, అయితే ధరలు సరిదిద్దుకునే దశల్లో లేదా రీబ్యాలెన్సింగ్ అవసరమైనప్పుడు ఏకమొత్తం పెట్టుబడులు మరింత అనుకూలంగా ఉండవచ్చని చెప్పారు.క్లుప్తంగా చెప్పాలంటే.. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ఎక్స్‌పోజర్‌ను పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం లోపే పరిమితం చేయడం ఉత్తమమని చెబుుతన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications