2025లో అద్భుతమైన ర్యాలీ అనంతరం సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్ లో పడిపోయాయి. మార్చి 2026కి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ 6 శాతం తగ్గి కిలోకు రూ.2,35,952కి చేరింది. ఫిబ్రవరి 2026కి సంబంధించిన బంగారు ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,36,124కి చేరాయి, వరుసగా రూ. 15,060 తగ్గుదలతో వెండి ధరలు కాస్త శాంతించాయని చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా డిసెంబర్ 31 బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ డ్రోన్ దాడి, వెనిజులా డాక్‌పై అమెరికా వైమానిక దాడులు, తైవాన్ సమీపంలోని చైనా సైనిక విన్యాసాలు వంటి అంశాలు స్వల్పకాలిక లాభాలను తీసుకొచ్చాయి. సాంప్రదాయ సురక్షిత ఆస్తులుగా బంగారం, వెండికు డిమాండ్ కొనసాగింది. అంతర్జాతీయంగా, స్పాట్ బంగారం 0.3 శాతం తగ్గి 4,334 డాలర్లకు.. US ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి 4,346.50 డాలర్లకి చేరాయి.

MCXలో గత సెషన్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.28 శాతం పెరిగి రూ.1,36,666 వద్ద ముగిశాయి. వెండి మార్చి ఫ్యూచర్స్ 11.84 శాతం పెరిగి కిలోకు రూ.2,51,012 వద్ద స్థిరపడ్డాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత కొనుగోళ్లు వ్యూహాలతో కొనసాగడంతో ధరలు కనిష్ట స్థాయిల నుండి పుంజుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు బులియన్‌లో స్వల్పకాలిక లాభాలకు సపోర్ట్ ఇస్తున్నాయని పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ తెలిపారు.
ఆయన అంచనా ప్రకారం.. బంగారం రూ.1,34,000 నుండి రూ. 1,35,200 వద్ద కొనుగోలు చేయడం మంచిదని తెలిపారు. ఆ స్థాయి వద్ద కొనుగోలు చేస్తే లాభాలను వెనకేసుకునే అవకాశం ఉందన్నారు. ఇక నిరోధ స్థాయి అంటే కొనుగోలు ఆపేస్థాయి విషయానికి వస్తే.. రూ.1,37,700 నుంచి రూ. 1,39,200 మధ్య అంచనా వేశారు. ఈ స్థాయికి బంగారం చేరితే కొనడం బంద్ చేయాలని సూచిస్తున్నారు. ఇక Silver విషయానికి వస్తే.. కొనుగోలు స్థాయి రూ.2,28,000 నుండి రూ. 2,40,000 మధ్య సూచిస్తున్నారు. అలాగే కొనుగోలు ఆపే స్థాయి రూ.2,62,000 నుండి రూ. 2,75,000 మధ్య సూచిస్తున్నారు.
పెట్టుబడిదారులు కొత్తగా ప్రారంభించే ముందు ధర స్థిరత్వం కోసం వేచి ఉండాలని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ అస్థిరతల్లో షార్ట్ సెల్లింగ్ నివారించాలని సూచించారు. ఏదేమైనా 2025 చివరి ట్రేడింగ్ రోజు బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక 2026లో వీటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications