బంగారం వెలుగులే ఎక్కువగా కనిపించినా.. వెండి మాత్రం నిశ్శబ్దంగా దీర్ఘకాలిక పెట్టుబడిలో శరవేగంగా దూసుకుపోతూ లాభాల పంట పండిస్తోంది. స్వల్పకాలంలో ధరల ఊగిసలాటకు పేరున్న ఈ తెల్ల లోహం.. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టిన వారికి భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. గత 25 ఏళ్ల వెండి ప్రయాణాన్ని గమనిస్తే.. ఇది ఎందుకు వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందో మనకు ఇట్టే తెలిసిపోతుంది.
2000 సంవత్సరంలో వెండిలో కేవలం రూ.1,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తి.. ఆ పెట్టుబడిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే, ఈరోజు దాని విలువ సుమారు రూ.26,455కు చేరేది. అంటే 25 ఏళ్ల కాలంలో 26 రెట్లు పెరుగుదల కనిపించేది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిలో సహనం, సమ్మేళన వృద్ధి ఎంత కీలకమో స్పష్టంగా చూపిస్తుంది. 25 ఏళ్ల క్రితం భారతదేశంలో కిలో వెండి ధర సగటున రూ.7,900 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అదే వెండి ధర కిలోకు రూ.2.16 లక్షల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ పెరుగుదల దాదాపు 2,600 శాతం రాబడిని సూచిస్తుంది. దీని వల్ల వెండిని కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే చూడాలన్న పాత భావన కనుమరుగవుతోంది.

ఇటీవల వెండి ధరలు చూసి మార్కెట్ వర్గాలే కాదు.. సామాన్య కొనుగోలుదారులూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే రూ.2 లక్షల మార్కును దాటిన Silver ధరలు ఇప్పుడు రూ.3 లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. ఈరోజు ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ.10 వేలు పెరగడంతో సరికొత్త రికార్డు నమోదైంది. బులియన్ మార్కెట్‌లో కిలో Silver ధర రూ.2,33,000కు చేరుకోగా, హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో మాత్రం రూ.2,44,000 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,33,000 వద్ద కొనసాగుతోంది.
ఒకప్పుడు వెండి ప్రధానంగా పరిశ్రమల అవసరాలకే పరిమితమై ఉండేది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీనిపై ఆసక్తి తక్కువగానే ఉండేది. కానీ కాలక్రమేణా, పారిశ్రామిక వినియోగంతో పాటు విలువైన లోహంగా కూడా దీని పాత్ర బలపడింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనత, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారంతో పాటు వెండి కూడా ఒక రక్షణ సాధనంగా పనిచేస్తోంది. డాట్‌కామ్ సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్ మహమ్మారి, తాజా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి అనేక సందర్భాల్లో వెండి తన విలువను నిలబెట్టుకున్న ఉదాహరణలు ఉన్నాయి.
ప్రస్తుతం వెండి ర్యాలీకి బలమైన డిమాండ్ కారణాలు ఉన్నాయి. కృత్రిమ మేధస్సు, డేటా సెంటర్లు, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం వంటి వేగంగా పెరుగుతున్న రంగాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరగడం, పారిశ్రామిక వినియోగం బలంగా ఉండడం వల్ల రాబోయే సంవత్సరాల్లో కూడా వెండి డిమాండ్ స్థిరంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో, గనుల తవ్వకాల్లో ఆటంకాలు, తగ్గుతున్న నిల్వలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా లోటును పెంచుతున్నాయి. ఏటా వేల టన్నుల వెండి లోటు ఉండవచ్చన్న అంచనాలు మార్కెట్‌ను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
2025లో వెండి ధరలు చరిత్రాత్మక స్థాయిలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 70 డాలర్లు దాటగా, దేశీయంగా MCXలో కిలో వెండి ధర రూ.2.16 లక్షల పైకి వెళ్లింది. వడ్డీ రేట్ల కోతపై అంచనాలు, బలహీనమైన డాలర్, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు ఈ ర్యాలీకి బలమిచ్చాయి. ఈ ఏడాది వెండి, బంగారం కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడం కూడా పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచింది. క్లుప్ంగా చెప్పాలంటే..ప్రపంచ అనిశ్చితులు కొనసాగుతున్న ఈ సమయంలో.. వెండి ఒక కీలకమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికగా మారింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications