అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వెండి ధరలు ఇటీవలి రోజుల్లో ఊహించని ఊగిసలాటను చూస్తున్నాయి. సోమవారం COMEX మార్కెట్లో వెండి ధర ఔన్సుకు రికార్డు స్థాయిలో 82.670 ఢాలర్ల వరకు ఎగబాకినప్పటికీ.. వారాంతం వచ్చే సరికి భారీగా పడిపోయింది. శుక్రవారం నాటికి వెండి ధర ఔన్సుకు 71.300 డాలర్ల వద్ద ముగిసింది. అంటే కేవలం కొన్ని రోజుల్లోనే ఔన్సుకు 11.37 డాలర్లు లేదా దాదాపు 13.75 శాతం పతనం నమోదైంది. ఈ అకస్మాత్తు పతనంతో కూడిన లాభాల బుకింగ్ వెనుక అనేక ఆర్థిక, పారిశ్రామిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్-సరఫరా అసమతుల్యత కారణంగా 2025 సంవత్సరంలో Silver ధర దాదాపు 180 శాతం పెరిగింది. ముఖ్యంగా పారిశ్రామిక వినియోగం పెరగడం వెండి ధరలకు బలమైన మద్దతునిచ్చింది. లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి సాలిడ్-స్టేట్ బ్యాటరీల వైపు ప్రపంచం వెళుతున్న నేపథ్యంలో.. వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెలువడ్డాయి. శామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ మార్పును అధికారికంగా ప్రకటించడంతో మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ బలపడింది.

అదే సమయంలో సరఫరా ఒత్తిళ్లు కూడా పెరిగాయి. అమెరికా-వెనిజులా మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, పెరూ, చాడ్ వంటి దేశాల నుంచి ఎగుమతుల్లో అంతరాయాలు, అలాగే 2026 జనవరి 1 నుంచి వెండి ఎగుమతులపై చైనా విధించిన 'షాడో నిషేధం' మార్కెట్‌ను మరింత ఉద్రిక్తకరంగా మార్చాయి. ఈ కారణాలన్నీ కలసి వెండి ధరలను భారీగా పెంచేలా చేశాయి. అయితే ధరలు ఆకాశాన్ని తాకడం.. దీర్ఘకాల పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ ప్రారంభించడంతో పతనం మొదలైంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెండి ధరలు ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ధరలు అధికంగా ఉన్నప్పుడు పారిశ్రామిక రంగాలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సౌర పరిశ్రమలో ఫోటోవోల్టాయిక్ సెల్స్ వెండి స్థానంలో రాగిని వినియోగించడం మొదలైంది. అలాగే బ్యాటరీ రంగంలో కూడా వెండి కాయిల్ బైండింగ్‌కు బదులుగా రాగి బైండింగ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్‌ను తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయెల్ మాట్లాడుతూ.. ఒక ముడిసరుకు ధర పరిశ్రమ లాభదాయకతను దెబ్బతీస్తే, ఆ పరిశ్రమ తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలను వెతుకుతుంది. ప్రస్తుతం వెండి ధరలు చాలా అధికంగా ఉండటంతో, పారిశ్రామిక డిమాండ్ ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన అంచనా ప్రకారం.. సంస్థల షార్ట్ కవరింగ్ కారణంగా వెండి ధరలు ఫిబ్రవరి 2026 నాటికి ఔన్సుకు 100 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారవచ్చని హెచ్చరించారు.
చరిత్రను పరిశీలిస్తే..వెండిలో భారీ బుల్ ర్యాలీ తర్వాత తీవ్ర పతనాలు చోటుచేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. 1980లో హంట్ బ్రదర్స్ కారణంగా, అలాగే 2011లో గరిష్ట స్థాయిల తర్వాత వెండి ధరలు 75 శాతం వరకు పడిపోయిన సందర్భాలు ఇందుకు ఉదాహరణలు. ఇదే తరహాలో 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వెండి ధరలు 60 శాతం వరకు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. COMEX మార్కెట్లో ఔన్సుకు 35 డాలర్ల నుంచి 40 డాలర్ల స్థాయి వరకు వెండి చేరవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ధరల స్థిరత్వాన్ని గమనించాలని, అధిక లాభాల ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications