సెంట్రల్ బ్యాంకులు సాధారణంగా బంగారాన్ని కొనుగోలు చేస్తాయి అని మనకి తెలుసు. కానీ సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ మాత్రమే వెండి కొన్నది. ఇలా కేవలం వెండి మాత్రమే కొనడం చాలా రేర్. CFP కిర్తన్ షా చెప్పినట్టుగా, ఇది ఏదో ర్యాండమ్ నిర్ణయం కాదు, వెండి మీద ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నట్టు సూచిస్తోంది.

కిర్తన్ షా లింక్డ్‌ఇన్ లో ఇలా చెప్పారు సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని సేకరిస్తుంటారు, కానీ సౌదీ సెంట్రల్ బ్యాంక్ వెండి కొన్న విషయం స్పెషల్. చిన్న మొత్తమే అయినా, ఇప్పుడు వెండి సరఫరా తగ్గి, డిమాండ్ పెరుగుతోందని ఇది చూపిస్తోంది.
వెండి ఇప్పుడు కేవలం ఆభరణాల్లో మాత్రమే కాదు, వివిధ పారిశ్రామిక రంగాల్లో కూడా కీలకంగా ఉపయోగపడుతోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో సర్క్యూట్ బోర్డ్స్, కనెక్టివిటీ కోసం వెండి తప్పనిసరి. 5G నెట్‌వర్క్, కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యాంటెనా సిస్టమ్స్‌లో కూడా వెండి వినియోగం పెరుగుతోంది. సౌరశక్తి ప్యానెల్స్‌లో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి వెండి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలు, ఛార్జింగ్ యూనిట్స్, కంట్రోలర్ సెన్సార్లలో వెండి కీలక భాగంగా ఉంది. అదనంగా, సేమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సర్వర్ కూలింగ్, బయోసెన్సర్స్, మెడికల్ డివైసెస్, ఫోటోకాపియర్ యంత్రాలు వంటి రంగాల్లోనూ వెండి అవసరం. ఈ విధంగా, వెండి ఇప్పుడు కేవలం ఆభరణాల మెటల్ కాదుగా, డిజిటల్, గ్రీన్ టెక్, మరియు పారిశ్రామిక గ్రోత్ కోసం ముఖ్యమైన మెటల్‌గా మారింది, దీని కారణంగా దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు పెద్ద లాభం సాధ్యమవుతుంది.
ఇప్పుడు "Make in India" ప్రాజెక్ట్ కింద తయారవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను 100 దేశాల్లో డెలివరీ చేయాలంటే, వాటి బ్యాటరీలు, ఛార్జింగ్ యూనిట్స్, సెన్సార్ల కోసం ఎక్కువగా వెండి అవసరం అవుతుంది. వెండి conductivity చాలా బాగా ఉండటంతో, EVs లో పవర్ ట్రాన్స్ఫర్, ఛార్జింగ్ మరియు సెన్సింగ్ సిస్టమ్స్‌లో కీలకంగా ఉపయోగపడుతుంది. అందుకే, భారతదేశంలో EV ఇండస్ట్రీ పెరుగుతున్నప్పటి కొద్దీ, వెండి డిమాండ్ కూడా గ్లోబల్ లెవెల్‌లో పెరుగుతుంది.
ది సిల్వర్ ఇన్స్టిట్యూట్ 2025 వరల్డ్ సిల్వర్ సర్వే ప్రకారం, వెండి సరఫరా గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరం కొరతలో ఉంది. 2024లో మాత్రమే 4,600 టన్నుల కొరత నమోదయింది. అంటే, ప్రపంచంలో వెండి డిమాండ్ అందుతున్న సరఫరాకి మించిన స్థాయిలో ఉంది. ఈ స్ట్రక్చరల్ షార్టేజ్ కారణంగా వెండి ధరలు పెరుగుతున్నాయి.
2026లో వెండి మైనింగ్ ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుతోందని అంచనా వేస్తున్నప్పటికీ, అంతకంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, సరఫరా లోపం ఇంకా తీవ్రమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్ వాహనాలు, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పరిశ్రమల్లో వెండి ఉపయోగం పెరుగుతూ ఉండటం కూడా ఈ కొరతను కారణమవుతుంది.
నిపుణులు చెప్పినట్లు, పెట్టుబడిదారులు తమ పొర్ట్‌ఫోలియోలో బంగారం మరియు వెండి ను స్మార్ట్‌గా భావించాలి. సాధారణంగా బంగారం 8% మరియు వెండి 15% పెట్టడం ఒక మంచి వ్యూహం.
2025 లో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి, బంగారం కంటే సుమారుగా 40% ఎక్కువ లాభం చూపించింది. అంటే, పెట్టుబడిదారులకు వెండి దీర్ఘకాలిక వృద్ధి కోసం మంచి పెట్టుబడి అని గుర్తించబడనుంది. స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నా మాంచి రిటర్న్స్ ఇవ్వోచు. అందుకే, ఎక్కువ మంది అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో వెండికి కేటాయించడం మొదలుపెట్టారు.
వాణిజ్య మార్కెట్ నిపుణుల ప్రకారం, గ్లోబల్ ట్రేడ్ టెన్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో మరియు US ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేటు తగ్గుతుందని అంచనాలు పెరుగుతుండటంతో, ట్రేడర్లు సేఫ్-హేవెన్ కొనుగోళ్లు పెంచారు. దీనివల్ల వెండి ఫ్యూచర్స్ మార్కెట్లో జీవితకాల అత్యధిక స్థాయిని తాకింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications