మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఇటీవల అకస్మాత్తుగా భారీగా పెరగడం దేశవ్యాప్తంగా లోహాల రంగంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా వెండి ఫ్యూచర్స్ ధరలు అంతర్జాతీయ స్పాట్ ధరలు, దేశీయ బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే నమ్మశక్యం కాని రీతిలో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయనే అంశం పరిశ్రమ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా జ్యువెలర్స్ & గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (AIJGF) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జనవరి 21న ఒక లేఖ రాసింది. అందులో తమ ఆందోళనలను స్పష్టంగా తెలియజేసింది.
MCXలో Silver కాంట్రాక్టులు ప్రస్తుత స్పాట్ లేదా బెంచ్‌మార్క్ ధరలతో పోలిస్తే దాదాపు కిలోకు రూ.40 వేల వరకు అధికంగా ట్రేడవుతున్నాయని లేఖలో AIJGF పేర్కొంది. ఇది సాధారణ మార్కెట్ డిమాండ్-సప్లై పరిస్థితులతో సమర్థించలేనంతగా ఉందని.. తీవ్రమైన, ఆకస్మిక ధరల స్థానభ్రంశం (price dislocation) జరుగుతోందని ఫెడరేషన్ అభిప్రాయపడింది. AIJGF జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా, జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ కేడియా సంతకం చేసిన ఈ లేఖలో.. వెండిపై దిగుమతి సుంకాలు పెరగవచ్చనే పుకార్లు ఈ ధరల పెరుగదలకి ప్రధాన కారణమై ఉండవచ్చని ఆరోపించారు. ఈ రూమర్లు మార్కెట్‌లో అతి వేగంగా వ్యాప్తి చెంది.. ఊహాగానాల ఆధారంగా ట్రేడింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా వెండి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యం, ఆర్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయ ప్రకటనలు, సురక్షిత ఆస్తుల వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి. దీనివల్ల బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో అధిక అస్థిరత కనిపిస్తోంది. ఈ గ్లోబల్ ఫ్యాక్టర్లు దేశీయ మార్కెట్‌లో కూడా ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

MCX మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. ధరల కనుగొనడం (price discovery) కరెన్సీ మార్పులు, దిగుమతి సుంకాలు, స్థానిక డిమాండ్-సప్లై పరిస్థితులు వంటి అనేక అంశాలను ప్రతిబింబిస్తుందని పేరు చెప్పని MCX ప్రతినిధి స్పష్టం చేశారు. అంతేకాదు ఎక్స్ఛేంజ్ బలమైన నిఘా వ్యవస్థతో పనిచేస్తోందని.. అన్ని నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తోందని కూడా ఆయన తెలిపారు.
వెండి ధరల కదలికలను గమనిస్తే.. ఒకరోజు తీవ్ర పతనం, మరుసటి రోజు బలమైన రికవరీ కనిపించడం మార్కెట్‌లోని అస్థిరతను స్పష్టంగా చూపుతోంది. ఒక దశలో వెండి, బంగారు ETFలు ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 20 శాతం వరకు పడిపోగా, చివరకు నష్టాలు కొంత తగ్గి సుమారు 11 శాతం వద్ద ముగిశాయి. MCXలో మార్చి డెలివరీ వెండి కాంట్రాక్టులు ఒక రోజు 2.7 శాతం తగ్గగా, ఫిబ్రవరి డెలివరీ బంగారం 0.8 శాతం తగ్గింది. అయితే ఆ తర్వాతి రోజు విలువైన లోహాలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి.
శుక్రవారం ట్రేడింగ్‌లో బలహీనమైన అమెరికన్ డాలర్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు, అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలకు మద్దతుగా నిలిచాయి. ఫిబ్రవరి 5, 2026 డెలివరీకి MCX గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,59,226కు చేరగా.. మార్చి 2026 డెలివరీకి సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు దాదాపు రూ.3.40 లక్షల స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా కూడా స్పాట్ గోల్డ్, స్పాట్ సిల్వర్ ధరలు రికార్డు స్థాయిలకు దగ్గరగా ట్రేడ్ అయ్యాయి.
ఈ పరిస్థితుల మధ్య, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు బంగారం ధరలపై తమ అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడిదారులు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కేంద్ర బ్యాంకుల డిమాండ్ కారణంగా విలువైన లోహాల మార్కెట్‌లో నిర్మాణాత్మక మార్పు వస్తోందని వారు పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం బంగారం, వెండి వంటి లోహాలపై ఆసక్తి తగ్గే అవకాశం తక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ధరలలో ఇంతటి వేగవంతమైన మార్పులు దేశీయ పరిశ్రమలు, ముఖ్యంగా ఆభరణాల రంగాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications