బంగారం, వెండి ధరలు లాభాల పంట పండిస్తున్నాయి. సమీప కాలంలో కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు వ్యూహాత్మకంగా మళ్లుతుండటంతో బంగారం, వెండి ధరలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని వారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ ర్యాలీకి బలమైన ట్రిగ్గర్లుగా మారాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చుట్టూ నెలకొన్న వివాదం మార్కెట్లలో ఆందోళనను పెంచింది. జూన్‌లో సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఆయనపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారన్న వార్తల అనంతరం.. ట్రంప్ పరిపాలన ఫెడ్‌ను తన విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా నడిపించేందుకు ఒత్తిడి తెస్తోందని పావెల్ ఆరోపించారు. పావెల్‌ను పదవి నుంచి తొలగించే ఉద్దేశం లేదని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. మే 2026లో ఆయన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయాలని ఒత్తిడి కొనసాగుతోందన్న కథనాలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచాయి.

కేంద్ర బ్యాంకు మీద ప్రభుత్వ జోక్యం ప్రపంచ మార్కెట్లకు ప్రతికూల సంకేతంగా మారుతోంది. ఇది ఫెడ్ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతూ.. బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులకు డిమాండ్‌ను పెంచుతోంది. స్టోన్‌ఎక్స్‌కు చెందిన మార్కెట్ విశ్లేషకురాలు రోనా ఓ కానెల్ ఇటీవల ఒక నివేదికలో.. ఫెడ్ స్వేచ్ఛపై అనుమానాలు Gold ధరలో మరో 500 డాలర్లు ఎగబాకే అవకాశాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. అమెరికా ఆర్థిక డేటా కూడా లోహాల ధరలకు మద్దతు ఇస్తోంది. డిసెంబర్‌లో ఉద్యోగ వృద్ధి అంచనాల కంటే బలహీనంగా నమోదవడంతో, ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. వడ్డీ రేట్ల కోతలు సాధారణంగా బంగారం, వెండి ధరలకు అనుకూలంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో విడుదల కానున్న US CPI డేటాపై ఇప్పుడు మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా విలువైన లోహాల ర్యాలీకి ఇంధనం పోస్తున్నాయి. ఇరాన్‌లో జరుగుతున్న భారీ నిరసనలు, వెనిజులా, గ్రీన్‌ల్యాండ్ అంశాలపై అమెరికా జోక్యం, అలాగే మెక్సికో, క్యూబాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు అనిశ్చితిని మరింత పెంచాయి. జపాన్‌కు చైనా విధించిన ఎగుమతి ఆంక్షలు ఆసియా ప్రాంతంలో ప్రమాదాన్ని పెంచగా, ఇరాన్‌పై సంభావ్య సైనిక చర్యలపై ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టాయి.
ధరల విషయానికి వస్తే.. 2025లో 150 శాతం కంటే ఎక్కువ పెరిగిన వెండి 2026 ప్రారంభమైన తొలి 13 రోజుల్లోనే మరో 13 శాతం లాభపడింది. ప్రస్తుతం వెండి సుమారు 85 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం 4,600 డాలర్ల స్థాయిని చేరి.. కొంచెం తగ్గిన తర్వాత 4,588 డాలర్ల వద్ద మద్దతు పొందుతోంది అంటే ఈ స్థాయి వద్ద నుంచి పైకి వెళ్లే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. బంగారానికి కీలక నిరోధ స్థాయి ఇంకా 4,770 డాలర్ల వద్దే ఉంది. ఈ స్థాయి వద్ద కొనుగోలు ఆపేయడం మంచిదని అర్థం చేసుకొవచ్చు.
ఇదిలా ఉంటే నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేస్తున్నారు. ప్రస్తుత ధరలు అనేక ప్రమాదాలను ఇప్పటికే ప్రతిబింబిస్తున్నాయని, అంతర్లీన పరిస్థితుల్లో మార్పులు వస్తే ధరలు ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. రిటైల్ పెట్టుబడిదారులు తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక దృక్పథంతో బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడం మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications