దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. జనవరి 19న దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుండటంతో.. దేశీయంగా MCX వెండి ఫ్యూచర్స్ కూడా ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) లో ఫిబ్రవరి 2026 గడువు ముగిసే వెండి ఫ్యూచర్స్ 1 కిలోకు రూ.3,01,318 వద్ద, మార్చి 2026 గడువు ముగిసే కాంట్రాక్టులు రూ.3,01,315 వద్ద కొత్త రికార్డును నమోదు చేశాయి. రోజువారీ ట్రేడింగ్‌లో MCX వెండి ధరలు 4.5 శాతం నుంచి నుంచి 5 శాతం వరకు లాభపడ్డాయి. ఒకే రోజులోనే వెండి ధర రూ.10 వేలు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

లోకల్ మార్కెట్లో కూడా Silver ధరలు భారీగా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ.1,000 పెరిగి రూ.30,500కు చేరుకోగా, 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.3,050 అయింది. 8 గ్రాముల వెండి ధర రూ.80 పెరిగి రూ.2,440గా నమోదైంది. 1 గ్రాము వెండి ధర రూ.10 పెరిగి రూ.305కు చేరుకుంది.
జనవరి నెలలో వెండి పెట్టుబడిదారులకు అత్యుత్తమ లాభాలను అందించింది. కేవలం 19 రోజుల్లోనే వెండి ధరలు 28 శాతం కంటే ఎక్కువ పెరిగి బంగారాన్ని కూడా మించిపోయింది. ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలే నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల ముప్పును తెరపైకి తీసుకురావడంతో, ఈసారి ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు టార్గెట్ అయ్యాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను పెంచి, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి ఆస్తుల వైపు పెట్టుబడిదారులను ఆకర్షించింది.
అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే సోమవారం స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 94 డాలర్ల వద్ద 4 శాతం కంటే ఎక్కువ పెరిగి కొత్త రికార్డును నమోదు చేసింది. గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు.. యూరోపియన్ దేశాలపై ప్రతిపాదిత సుంకాలు, ప్రతీకార చర్యలపై చర్చలు అన్నీ కలిపి సురక్షిత ఆస్తులపై డిమాండ్‌ను మరింత పెంచాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం.. యూరోపియన్ నాయకులు అమెరికా వస్తువులపై ప్రతిస్పందన చర్యలను పరిశీలిస్తున్నారు.
వెండి ధరల భవిష్యత్తుపై నిపుణులు బుల్లిష్ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ ప్రకారం.. MCX వెండి ధర రూ.2,95,000 పైన నిలకడగా ట్రేడైతే అప్‌సైడ్ మొమెంటం కొనసాగుతుంది. రూ.3,05,000 స్థాయిని స్పష్టంగా దాటితే రూ.3,15,000 లేదా అంతకంటే పై స్థాయిలు సాధ్యమని ఆయన అంటున్నారు. ప్రతికూలంగా, రూ.2,90,000 కంటే దిగువకు వెళ్తే రూ.2,85,000 వరకు సవరణ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతర్జాతీయంగా COMEX సిల్వర్ 93 డాలర్ల నుంచి 94 డాలర్ల స్థాయిల వద్ద బలంగా నిలిచింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, AI, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, సరఫరా లోటుతో కలిసి వెండిని దీర్ఘకాలికంగా బలమైన పెట్టుబడి ఆస్తిగా మార్చుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2026లోకి అడుగుపెడుతున్న కొద్దీ వెండి ధరలు 100 డాలర్లకు మించిన స్థాయిలను చేరడం అసాధ్యం కాదని మార్కెట్ సంకేతాలు సూచిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications