ఆపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసిన వెండి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తుల జాబితాలో రెండో స్థానానికి..

బంగారం కన్నా వెండి ఇప్పుడు చాలా విలువైనదిగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ ధరలు అమిత వేగంతో దూసుకుపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులు వెండి ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఏకంగా ప్రపంచ్ టాప్ దిగ్గజాల ఆస్తుల మార్కెట్ వాల్యూని కూడా వెండి దాటేస్తోంది. బంగారం కన్నా వెండిలోనే పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు అనుకోవడంతో వెండి ర్యాలీ అసలు ఆగడం లేదు.

silver market value silver overtakes apple silver beats alphabet silver vs nvidia world s most valuable asset silver silver surpasses big tech silver market cap silver price rally silver investment news precious metals market silver demand surge gold market value gold vs silver valuation global asset rankings commodities vs tech stocks silver inflation hedge silver green energy demand safe haven assets silver outperforming stocks global wealth shift silver beats apple market cap silver beats google market cap silver investment outlook precious metals boom silver price forecast vs

ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో వెండి (Silver) భారీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు బంగారం నీడలో ఉన్న వెండి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తుల జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. మార్కెట్ విలువ పరంగా టెక్ దిగ్గజాలైన ఆపిల్ (Apple), ఆల్ఫాబెట్ (Alphabet)లను అధిగమించిన Silver.. ఇప్పుడు NVIDIAను కూడా దాటేసి బంగారం తర్వాత రెండవ స్థానాన్ని దక్కించుకునే దిశలో దూసుకువెళుతోంది.

companiesmarketcap.com తాజా డేటా ప్రకారం.. వెండి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.22 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రస్తుతం 4.592 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన NVIDIA కంటే కేవలం 8.1 శాతం మాత్రమే తక్కువ. మరోవైపు.. బంగారం మాత్రం 31.598 ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వెండి విలువలో ఈ అకస్మాత్తు పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న చారిత్రాత్మక ధరల ర్యాలీ. అంతర్జాతీయ మార్కెట్లో, Comexలో స్పాట్ సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఔన్సుకు 75 డాలర్లు దాటి కొత్త ఆల్ టైమ్ హైను నమోదు చేశాయి. ఇది పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, వెండిపై మళ్లీ దృష్టి పడేలా చేసింది.

భారతదేశంలో కూడా వెండి ధరలు అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ ధరలు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కిలోగ్రాముకు రూ. 2,33,115కు చేరుకుని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఇది దేశీయ కమోడిటీ మార్కెట్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో.. టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న NVIDIA షేర్ ధరలు గత 24 గంటల్లో 0.32 శాతం తగ్గి రూ. 188.61 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ తేడా వెండి, టెక్ స్టాక్స్ మధ్య జరుగుతున్న స్పష్టమైన మార్పును చూపిస్తోంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. వెండి మార్కెట్లో ఉన్న జోరు ఇదే విధంగా కొనసాగితే, త్వరలోనే వెండి NVIDIAను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన ఆస్తిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వెండి మార్కెట్లలో అసాధారణ ధరల వ్యత్యాసాలు కూడా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కామెక్స్, షాంఘై ఎక్స్ఛేంజ్‌ల మధ్య వెండి ధర వ్యత్యాసం దాదాపు 7 డాలర్లకి పెరగడం గమనార్హం. సాధారణంగా ఇది 1 డాలర్ కంటే తక్కువగా ఉండేది.

భారతీయ మార్కెట్‌లో వెండి ర్యాలీ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. MCXలో వెండి ధరలు గత ఏడాదితో పోలిస్తే 153 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. 2024 డిసెంబర్ 26న కిలోకు రూ.91,600గా ఉన్న ధర, 2025 డిసెంబర్ 26 నాటికి రూ.2,31,879కి చేరింది. బంగారం కూడా మంచి రాబడులను అందించినప్పటికీ.. వెండి వేగానికి అది సరిపోవడం లేదు. 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.77,460 నుంచి రూ.1,39,233కి పెరిగి దాదాపు 80 శాతం లాభాన్ని ఇచ్చాయి. క్లుప్తంగా చెప్పాలంటే వెండి ఇప్పుడు కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, ప్రపంచ ఆస్తి మార్కెట్లలో శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా మారింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+