అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చింది. ఈ చేర్పు అమెరికా వనరుల విధానంలో ఒక ప్రధాన మార్పును సూచిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ సరఫరా గొలుసులపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. US ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రచురించిన US Geological Survey (USGS) సవరించిన జాబితాలో ఇప్పుడు మొత్తం 60 ఖనిజాలు ఉన్నాయి. ఇది గత జాబితా కంటే 10 ఎక్కువగా చెప్పవచ్చు. కొత్తగా చేర్చిన లోహాలు ఏంటంటే.. రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium), పొటాష్ (Potash), రీనియం (Rhenium), సిలికాన్ (Silicon), సీసం (Lead), వంటివి ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక అభివృద్ధి, రక్షణ రంగాల్లో అత్యంత అవసరమైన వనరులుగా పరిగణించబడుతున్నాయి.

ట్రంప్ పరిపాలన యొక్క వ్యూహాత్మక దృష్టి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ ఖనిజాల దేశీయ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ను జాతీయ ప్రాధాన్యతగా ప్రకటించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీ వనరులపై అధిక ఆధారపడటం అమెరికా భద్రత, మౌలిక సదుపాయాలు, సాంకేతిక పురోగతికి ప్రమాదకరమని పేర్కొన్నారు. Section 232 దర్యాప్తు పరిధిలోకి వచ్చే ఈ వనరులు కొత్త సుంకాలు లేదా వాణిజ్య పరిమితులకు కూడా దారితీయవచ్చు. ఇది అమెరికా ఖనిజ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు, మైనింగ్ అనుమతుల వేగవంతమైన ప్రక్రియలు వంటి చర్యలకు మార్గం సుగమం చేస్తుంది.
చైనా ఆధారిత సరఫరా గొలుసుపై ప్రభావం: ప్రస్తుతం ప్రపంచ రాగి శుద్ధిలో ఎక్కువ భాగం చైనాలోనే జరుగుతుంది. అలాగే అమెరికా తన రాగి అవసరాల సగం వరకు చిలీ, పెరూ, కెనడాల నుండి దిగుమతుల ద్వారా తమ అవసరాలను నెరవేర్చుకుంటోంది. పొటాష్ విషయంలో కూడా అమెరికా తన అవసరాల్లో 80 శాతం కెనడా నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇలాంటి విదేశీ ఆధారపడటాన్ని తగ్గించడానికి అమెరికా దేశీయ మైనింగ్, రీసైక్లింగ్ ప్రాజెక్టులు.. అలాగే సాంకేతికత ఆధారిత వనరుల పునరుద్ధరణపై దృష్టి పెడుతోంది.
వెండిని ఈ జాబితాలో చేర్చడం వల్ల విలువైన లోహాల మార్కెట్ లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల తయారీలో విస్తృతంగా వెండిపై ఆధారపడుతుంది. ఏవైనా సుంకాలు లేదా వాణిజ్య పరిమితులు విధించినట్లయితే, ఇవి మార్కెట్లలో అస్థిరతను పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ తాజా చేర్పులతో, అమెరికా కేవలం తన వనరుల స్వావలంబనను మాత్రమే కాకుండా, ప్రపంచ ఖనిజ మార్కెట్లలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే సంవత్సరాలలో, ఈ వ్యూహం శుద్ధి ఇంధన మార్పు (Clean Energy Transition), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ పరిశ్రమలకు అవసరమైన సరఫరా భద్రతను బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా యొక్క ఈ చర్య చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడమే కాకుండా.. రాగి, వెండి వంటి లోహాలను కొత్త rare earths గా నిలబెడుతోంది. ఇది గ్లోబల్ మైనింగ్ పెట్టుబడులు, సరఫరా గొలుసు మార్పులు, వాణిజ్య సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications