సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్: 35 ఏళ్ల తర్వాత తొలిసారి చర్చిల్ క్లబ్ క్లోజ్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 11,500 మంది వరకు మృతి చెందగా, దాదాపు మూడు లక్షల మందికి సోకింది. ప్రపంచ దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి. కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపారులు క్లోజ్ చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీ కూడా కరోనా దెబ్బకు మూతబడింది. ఇక్కడి చర్చిల్ క్లబ్ గత 35 ఏళ్ళుగా నిరంతరంగా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు తొలిసారి ఇది మూతబడింది.

చర్చిల్ క్లబ్ ఈవెంట్స్ ఫోరం తొలిసారి షట్ డౌన్
1985 నుండి సిలికాన్ వ్యాలీలో స్వతంత్ర ఆలోచన నాయకత్వానికి మంచి వేదిక. ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధి, సామాజిక స్పృహను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. తొలి చర్చిల్ క్లబ్ 1985 నవంబర్ 2న సమావేశమైంది. ఇందులో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. దీనిని ప్రస్తుత ఫోర్బ్స్ మేగజైన్ పబ్లిషర్ రిచ్ కార్ల్‌గాడ్, మరో ప్రముఖ మేగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ టోనీ పెర్కిన్ ప్రారంభించారు. టెక్ పరిశ్రమ దిగ్గజాలు మొదలు రాక్ స్టార్స్, విమర్శకుల వరకు ఎంతో మందికి ఇది వేదిక. ఇది ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మూతబడింది.

అమెరికాలో మూత..
అమెరికాలో కరోనా కారణంగా రెండు వందలమందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. సిలికాన్ వ్యాలీ (శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్) పూర్తిగా క్లోజ్ అయింది. గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ వంటి ఎన్నో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ప్రపంచ వాణిజ్య కేంద్రం న్యూయార్క్ స్తంభించిపోయింది. అమెరికాలో అత్యవసరమైతే తప్ప అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

నగరాలన్నీ నిర్మానుష్యం
నైట్ క్లబ్స్, రెస్టారెంట్లు మూసివేశారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికాలోని ముఖ్య నగరాలన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. అమెరికాలోని తెలుగువారు ఇళ్లకే పరిమితం కావాలని తెలుగు సంఘాలు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications