SVB: ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాను.. ఆ దేశ బ్యాంకింగ్ రంగ సంక్షోభం కుదిపేస్తోంది. సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకుల ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బిలియన్ల కొద్దీ డాలర్లను బయటకు తరలించలేక వివిధ స్టార్టప్లు నానా బాధలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో HSBC బ్యాంకు ఓ అడుగు ముందుకేసి UKకి చెందిన SVBని రక్షించడానికి పూనుకుంది. అయితే బ్యాంకు కుప్పకూలినా దాని ఉద్యోగులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

ఇప్పటికే సంతకాలు పూర్తి
HSBC బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ UK సిబ్బందికి 18 మిలియన్ల బోనస్ లభించనుంది. SVBకి సంబంధించిన బ్రిటన్ విభాగాన్ని 1 పౌండ్(దాదాపు రూ.100) వెచ్చించి HSBC దక్కించుకోవడం తెలిసిందే. తద్వారా ఈ కొనుగోలు ఒప్పందం, సిబ్బంది బోనస్ పై ఇప్పటికే సంతకాలు జరిగినట్లు తెలుస్తోంది.

స్థిరత్వం కోసం HSBC ప్రయత్నాలు
ఈ డీల్ అనంతరం వినియోగదారులను కాపాడటానికి HSBC ప్రయత్నాలు ప్రారంభించింది. 2 బిలియన్ డాలర్ల నిధులను హామీగా ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా రుణదాతలను ఆకర్షించి, బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వం నెలకొల్పడానికి చూస్తోంది. మాతృ సంస్థ SVB US నుంచి UK విభాగాన్ని ఈ చర్యలు వేరు చేయనున్నాయి.

US ఉద్యోగుల మాటేమిటి ?
చాప్టర్ 11 ప్రకారం దివాలా కింద పునర్నిర్మాణం జరిగిన తర్వాత రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించడానికి కొంత సమయం దొరుకుతుంది. ఈ విధంగా 2.1 బిలియన్ డాలర్లను చొప్పించి.. విదేశీ కరెన్సీ ఖాతాలు కలిగిన భారతీయ స్టార్టప్లకు HSBC భరోసా కల్పించింది.
SVB UKలోని సిబ్బంది బోనస్ లు పొందుతుండటంతో.. USలోని ఉద్యోగులకు 45 పనిదినాలకుగాను 1.5 రెట్లు జీతాన్ని అందుకోనున్నారు. మొత్తానికి SVB పతనం, దాని ఉద్యోగులకు వరంగా మారిందన్న మాట.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications